దిశ మార్చుకున్న 'ఓఖీ' .. మహారాష్ట్ర, గుజరాత్ వైపు పయనం

కేరళ, తమిళనాడు రాష్ట్రాలను అల్లకల్లోలం చేసి భీభత్సం సృష్టించిన 'ఓఖీ' తుఫాను దిశ మార్చుకుంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రభావం చూపనుంది. ఈ మేరకు జాతీయ వాతావరణ విభాగం (ఎంఐడీ) ఒక హెచ్చరిక జారీచేసింది.

Last Updated : Dec 5, 2017, 12:32 PM IST
దిశ మార్చుకున్న 'ఓఖీ' .. మహారాష్ట్ర, గుజరాత్ వైపు పయనం

కేరళ, తమిళనాడు రాష్ట్రాలను అల్లకల్లోలం చేసి భీభత్సం సృష్టించిన 'ఓఖీ' తుఫాను దిశ మార్చుకుంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రభావం చూపనుంది. ఈ మేరకు జాతీయ వాతావరణ విభాగం (ఎంఐడీ) ఒక హెచ్చరిక జారీచేసింది. 'ఓఖీ' దిశ మార్చుకొని మహారాష్ట్ర, గుజరాత్ వైపు పయనిస్తోంది. అధికారులందరూ సిద్ధంగా ఉండాలి' అని పేర్కొనింది. 

'ఓఖీ' తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముంబైలో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులిచ్చారు. రానున్న 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు సంభవించవచ్చు అనే హెచ్చరికల నేపథ్యంలో గుజరాత్, మహారాష్ట్ర తీరప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుగానే సహాయక సిబ్బందిని సిద్ధం చేసుకున్నారు. రైలు, విమాన సర్వీసు యాధాతధంగానే నడుస్తాయని.. తుఫాను తీవ్రతను అంచనా వేసి తదుపరి చర్యలు చేపడతాము అని మహారాష్ట్ర మంత్రి  ఒకరు చెప్పారు. తీరప్రాంతాల్లో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. 

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. విద్యుత్ సరఫరా, తాగునీరు పునరుద్ధరించారు. 'ఓఖీ' తుఫాను కారణంగా సుమారు 25 మంది మృతి చెందారు. వేటకు వెళ్లిన జాలర్లను సహాయక సిబ్బంది శాయశక్తులా కృషిచేసి రక్షిస్తోంది. ఇంకా కొంత మంది జాలర్ల ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆయా రాష్ట్రాల్లో తీరప్రాంత ప్రజలు ఆందోళనలో ఉన్నారు. పరిస్థితి సమీక్షించేందుకు ఆదివారం కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కన్యాకుమారి వెళ్లారు. కేంద్ర హోమ్ మంత్రి కూడా ఆయా రాష్ట్రాల సీఎంలతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. హర్యానా ప్రభుత్వం రూ.రెండు కోట్లు విరాళమిచ్చింది. 

 

Trending News