కోల్‌కతా : అంఫాన్ తుఫాన్ ( Cyclone Amphan ) భారీ ప్రాణ, ఆస్టి నష్టాన్ని మిగిల్చింది. కేవలం పశ్చిమ బెంగాల్లోనే ( West Bengal ) అంఫాన్ తుఫాన్ తాకిడికి 72 మంది మృతి చెందినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( CM Mamata Banerjee ) తెలిపారు. చనిపోయిన 72 మందిలో 15 మంది కోల్‌కతాకు చెందిన వారేనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. అంఫాన్ తుఫాన్ మిగిల్చిన నష్టంపై మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తాను ఇంతటి ఘోర విపత్తును ఎప్పుడూ చూడలేదని దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పశ్చిమ బెంగాల్ లో పర్యటించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతానని అన్నారామె. తుఫాన్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్టు మమత బెనర్జీ స్పష్టంచేశారు. ( Read also : Amphan Cyclone : అలజడి సృష్టిస్తోన్న అంఫాన్ తుఫాన్.. రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు )
అంఫాన్ తుఫాన్ కారణంగా పశ్చిమ బెంగాల్‌కి తీవ్ర ముప్పు పొంచి ఉందనే హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం రాత్రి నుండి రాష్ట్ర సచివాలయం నబన్న వద్దే పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తుఫాన్ ప్రభావం "కరోనావైరస్ కన్నా ఘోరంగా ఉంది" అని ఆవేదన వ్యక్తంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..