మీ వద్ద డెబిట్ లేక కార్డులున్నాయా. అయితే ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. వాటిలో కొందరు వినియోగదారుల కార్డులు మార్చి 16 నుండి పనిచేయకపోవచ్చు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ విషయంపై కార్డుదారులను జనవరి నెలలోనే హెచ్చరించింది. ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏ కార్డులు పనిచేయవు అనే మీ సందేహం కదా. ఆ వివరాలపై ఓ లుక్కేయండి.
See Pics: మొన్న పింక్ బికినీలో.. నేడు బ్లాక్ బికినీ..
కార్డుల సెక్యూరిటీ విషయంలో అలర్ట్ చేసే ఆర్బీఐ తాజాగా కొన్ని డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేయవని చెబుతోంది. మీ వద్ద ఉన్న ఈ కార్డుల్లో మార్చి 16వ తేదీ వరకూ ఒక్కసారి కూడా వినియోగించని కార్డు ఏమైనా ఉంటే అవి పనిచేయవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మీ వద్ద క్రెడిట్, డెబిట్ కార్డులను మార్చి 16లోగా కనీసం ఒక్కసారైనా వినియోగించాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.
తండ్రి ఆత్మహత్యపై అమృత రియాక్షన్ ఇలా ఉందా!
డెబిట్/క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్స్ సమయంలో సెక్యూరిటీ పెంచడంతో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు తరచుగా క్రెడిట్ లేక డెబిట్ కార్డులు వినియోగిస్తేనే వారి కార్డులకు సంబంధించి భద్రత కల్పంచడం తేలిక అవుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ ఆధారంగా ఈ కార్డులు పనిచేస్తాయని తెలిసిందే
ప్రణయ్ హత్యకేసు: అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య
మార్చి 16లోగా ఒక్కసారి కూడా ట్రాన్సాక్షన్‌కు వినియోగించని కార్డులను నేరుగా వినియోగించే అవకాశం ఉంది. దీనిపై మరికొన్ని రోజుల్లో ఆర్బీఐ స్పష్టత ఇవ్వనుంది.