క్రిస్మస్ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. గుజరాత్ లోని రాజ్ కోట్ లో నిర్వహించిన విందులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. క్రతగాత్రులను స్థానిక ఆస్పత్రి తీసుకెళ్లి చికిత్సనందిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పేలుడు సమయంలో మహిళలు, పిల్లలు ఉన్నారు. ఒక్కసారి చెలరేగిన మంటలను చూసి వెంటనే జనాలు పరుగులు పెట్టారు.
పెద్దగా పేలుడు శబ్దం వినిపించడంతో తొలత ఇది బాంబు పేలుడు అనుకున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అందరూ భయభ్రాంతులయ్యారు. గ్యాస్ తో నిండిన బెలూన్ పేలిందనే విషయాన్ని తెలసుకున్న తర్వాత స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్ నింపిన బెలూన్ పేలడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానిక పోలీసులు నిర్ధారించారు