Lockdown: కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతంగా విస్తరిస్తోంది. విధిలేని పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు లౌక్‌డౌన్ ప్రకటిస్తే..మరికొన్ని రాష్ట్రాలు నైట్‌కర్ప్యూ, వీకెండ్ కర్ఫ్యూలు విధించాయి. దేశంలో ఏయే రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
కరోనా సెకండ్ వేవ్ (Corona second Wave)ప్రతాపానికి దేశం గజగజవణికిపోతోంది. దేశంలో కరోనా కారణంగా భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. చికిత్స అందించలేని పరిస్థితులు వచ్చేశాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 3 లక్ల 79 వేల కేసులు (India Highest coronavirus cases)నమోదయ్యాయి.ఈ నేపద్యంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ అమలు చేస్తుండగా..మరికొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ దిశగా ఆలోచన చేస్తున్నాయి. ప్రజారోగ్యం దృష్ట్యా రాష్ట్రాలు విధిలేక సంపూర్ణ లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంది. నేటి రాత్రి నుంచి గోవాలో లాక్డౌన్ ( Lockdown) అమల్లోకి రానుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ కూడా ఈ జాబితాలో వచ్చి చేరింది. ఏప్రిల్ 30 వ తేదీ నుంచి మే 4 వరకూ సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది.
త్వరలో గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో లాక్డౌన్ ప్రకటించే అవకాశాలున్నాయి. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో కరోనా ఇప్పటికే కల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతానికి ఇక్కడ పాక్షిక లాక్డౌన్ అమల్లో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ(AP), తెలంగాణల్లో(Telangana) సైతం లాక్డౌన్ విధించే పరిస్థితులైతే కన్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమే ఆ నిర్ణయం తీసుకుంటుందని వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా 3-4 రోజుల్లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై స్పష్టత రానుంది.
Also read: Bombay High Court: వ్యాక్సిన్ ధర అందరికీ ఒకటే ఉండాలి, 150 కే విక్రయించాలంటూ పిటీషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook