Covid19 free village competitions: సాధారణంగా ఏదైనా పోటీలో విజయం సాధిస్తే ప్రథమ స్థానంలో నిలిచిన వారికి, సంస్థకుగానీ అవార్డులు, పతకాలు అందిస్తారు. కొన్ని సందర్భాలలో నగదు బహుమతిని ప్రకటిస్తారు. ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా దేశంలో కోవిడ్-19 కారణంగా తీవ్రంగా నష్టపోతున్న మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన పోటీలను ప్రకటించింది.
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు, రాష్ట్రంలో కోవిడ్19(Covid-19) కేసులు, మరణాలను అరికట్టడంలో భాగంగా మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ (Maharashtra Government) వినూత్నంగా ఆలోచించింది. ఎన్ని జాగ్రత్తలు చెప్పినా, జరిమానాలు వేసిన అంతగా ప్రయోజనం ఉండదని, ఏకంగా నగదు బహుమతి ప్రకటించి పోటీలను ప్రారంభించింది. కరోనాను నిర్మూలించిన గ్రామాలకు రూ.50 లక్షలు, రూ.25 లక్షలు, రూ.15 లక్షల మేర నగదు బహుమతి అందించనున్నారు.
Also Read: Indian Covid-19 Variants: ఇండియన్ కోవిడ్-19 వేరియంట్స్‌కు Kappa మరియు Deltaగా నామకరణం చేసిన WHO
కరోనా నిర్మూలనపై పోటీల వివరాలను మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ హసన్ ముష్రిఫ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ వివరించారు. కరోనా కట్టడి చర్యలలో భాగంగా గ్రామీణ ప్రాంతాల వారికి నగదు బహుమతి ప్రకటించినట్లు తెలిపారు. కోవిడ్19 నిబంధనలు పాటించి, కరోనా వైరస్ (CoronaVirus)ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రతి రెవెన్యూ డివిజన్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన గ్రామ పంచాయతీలకు నగదు అందజేయనున్నట్లు చెప్పారు.
Also Read: EPF Interest Amount: 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, వడ్డీపై కీలక నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook