Delhi logs highest one day rise with 28,867 cases Mumbai logs 13,702 new Covid cases: దేశంలో కోవిడ్ థర్డ్‌వేవ్ (Covid Thirdwave) వల్ల కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల (Covid cases) సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
తాజాగా దేశంలో ఏకంగా రెండున్నర లక్షల మార్క్‌కు కోవిడ్ చేరువయ్యాయి. కోవిడ్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ (Omicron) హడలెత్తిస్తోంది. ఇక తాజాగా ఢిల్లీలో (Delhi) రికార్డ్ స్థాయిలో కోవిడ్ కేసులో నమోదు అయ్యాయి. అలాగే ముంబైలో (Mumbai) కూడా కరోనా కేసులు పెరిగాయి.
ఢిల్లీలో తాజాగా 28,867 కోవిడ్ కేసులు (covid cases) నమోదయ్యాయి. 31 మరణాలు సంభవించాయి. ఢిల్లీలో పాజిటివీ రేట్ 29.21 శాతంగా ఉంది. 22,121 మంది రికవరీ కాగా.. 94,160 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక బుధవారం ఢిల్లీలో 26.22 శాతం పాజిటివ్ రేటుతో 27,561 కరోనావైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
COVID-19 | Delhi reports 28,867 new cases, 31 deaths and 22,121 recoveries. Active cases 94,160
Positivity rate 29.21 % pic.twitter.com/vAWjpqtlyC
— ANI (@ANI) January 13, 2022
ముంబైలో (Mumbai) తాజాగా 13,702 కేసులు నమోదు అయ్యాయి. అక్కడ యాక్టివ్ కేసులు 95,123 ఉన్నాయి. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ముంబైలో ఆరుగురు మరణించారు. అలాగే మహారాష్ట్రలో (Maharashtra) గత 48 గంటల్లో 329 మంది పోలీసు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 126 మంది కోవిడ్‌తో మరణించారు. 1,102 యాక్టివ్ కేసులు ఉన్నాయని ముంబై పోలీసులు తెలిపారు.
COVID19 | Mumbai reports 13,702 fresh cases & 6 deaths today; Active cases at 95,123 pic.twitter.com/zER5SK2035
— ANI (@ANI) January 13, 2022
కర్ణాటకలో (Karnataka) గత 24 గంటల్లో 25,005 కోవిడ్ కొత్త కేసులు నమోదు అయ్యాయి. 2363 మంది రికవరీ కాగా కొత్త 8 మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో ప్రస్తుతం 1,15,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Karnataka reports 25,005 new cases, 2363 recoveries and 8 deaths in the last 24 hours. Active cases 1,15,733 pic.twitter.com/sOaxdJcGj1
— ANI (@ANI) January 13, 2022
గుజరాత్‌లో (Gujarat) గత 24 గంటల్లో 11,176 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. 4,285 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గుజరాత్‌లో తాజాగా కోవిడ్ వల్ల ఐదుగురు మరణించారు.
ఇక గోవాలో (Goa) తాజాగా 3,728 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వల్ల నలుగురు మరణించారు. యాక్టివ్ కేసులు 16,887 ఉన్నాయి.
Also Read : IND vs SA: టీమ్‌ఇండియా 198 పరుగులకు ఆలౌట్.. ప్రోటీస్ ముందు స్వల్ప లక్ష్యం!
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 84,280 కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించగా.. కొత్తగా 2,707 పాజిటివ్ కేసులు తేలాయి. దీంతో తెలంగాణలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 7,02,801కి చేరింది. తాజాగా కోవిడ్ వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి తాజాగా 582 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 20,462 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక ఏపీలో (AP) కొత్తగా 4,348 మందికి కోవిడ్ (Covid)పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 14,507 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.
Also Read : Murder case: తల మాత్రమే దొరికిన హ్యత్య కేసులో పురోగతి- తుర్కయాంజల్‌లో మొండెం లభ్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook