Covid Precaution Vaccine Dose : రేపటి నుంచి కోవిడ్ ప్రికాషన్ డోస్‌, వారు మాత్రమే అర్హులు, రిజిస్ట్రేషన్ ఇలా!

Covid booster shots Precaution Vaccine Doses details : రేపటి నుంచి ప్రికాషన్ డోస్‌. ప్రికాషన్ డోస్‌కు ఎవరు అర్హులు, డోస్‌ల మధ్య గ్యాప్, రిజిస్ట్రేషన్ వివరాలు. మొదటి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ అయితే తీసుకున్నారో అదే రకం వ్యాక్సినే ప్రికాషనరీ డోస్‌లో ఇస్తారు. 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారితో పాటు వారికి ఈ బూస్టర్‌ డోసు ఇవ్వనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 04:16 PM IST
  • రేపటి నుంచి ప్రికాషన్ డోస్‌ వ్యాక్సినేషన్
  • ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ కార్మికులు, 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి వ్యాక్సిన్‌
  • ఎలా నమోదు చేసుకోవాలి, అర్హత, తదితర వివరాలు
Covid Precaution Vaccine Dose : రేపటి నుంచి కోవిడ్ ప్రికాషన్ డోస్‌, వారు మాత్రమే అర్హులు, రిజిస్ట్రేషన్ ఇలా!

Covid booster shots India Starts Precaution Vaccine Doses from Tomorrow Eligible, Booking, registration full details here : దేశంలో ఒకవైపు ఒమిక్రాన్‌ విజృభిస్తోంది. కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్న వేళ వ్యాక్సినేషన్‌ (Vaccination‌) ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోంది కేంద్రం. ఇందులో భాగంగానే రేపటి నుంచి అంటే జనవరి 10 నుంచి ప్రికాషన్‌ డోసులు (Precaution Vaccine Doses ) అందించనుంది. ఇందుకోసం ఇప్పటికే అపాయింట్‌మెంట్స్ ప్రక్రియ ప్రారంభమైంది. 

ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, (Frontline workers) 60 ఏళ్ల పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి రేపటి నుంచి ప్రికాషన్ డోస్‌ (Precision dose‌) ఇవ్వనున్నారు. 60 ఏళ్ల పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రికాషనరీ డోస్ ఇవ్వనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభనతో కోవిడ్ కేసులు (Covid cases) పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం బూస్టర్ షాట్‌లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ప్రికాషన్‌ డోసులు తీసుకునేందుకు అపాయింట్‌మెంట్ రిజిస్ట్రేషన్ (Registration) ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. అయితే అర్హులైన వారు వ్యాక్సినేషన్ సెంటర్‌‌కు వెళ్లి కూడా ప్రికాషన్‌ డోసు కోసం అపాయింట్‌మెంట్ బుక్‌ చేసుకోవచ్చని ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ ముందు జాగ్రత్త డోసుకు ఎవరు అర్హులు, డోస్‌ల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి రిజిస్ట్రేషన్ వివరాలు ఏమిటి అనే వివరాలు ఒకసారి చూద్దాం. 

ఎవరు అర్హులు?

ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ కార్మికులు, (Frontline workers) 60 ఏళ్లు (60 years) పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రికాషనరీ డోసు తీసుకునేందుకు అర్హులు.

షాట్‌ల మిక్సింగ్ ఉండదు

ఇప్పటికే కోవిడ్-19 రెండు డోసులకు సంబంధించి ఏ వ్యాక్సిన్ అయితే తీసుకున్నారో ప్రికాషన్‌ డోసు (Precautions‌ dose) విషయంలో కూడా అదే కంపెనీకి సంబంధించిన డోసు ఇస్తారు. ప్రికాషన్‌ డోసులో వ్యాక్సిన్‌ల మిక్సింగ్‌ ఉండదని కేంద్రం తెలిపింది. ఇప్పటికే రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ (Two-dose vaccine) కోవిషీల్డ్‌ తీసుకుని ఉంటే.. ప్రికాషన్‌ డోసు కూడా కోవిషీల్డ్‌నే అందిస్తారు. ఒకవేళ కోవాగ్జిన్ తీసుకుని ఉంటే అదే ఇస్తారు.

ఇతర అనారోగ్య సమస్యలు

ఇక కోమోర్బిడిటీలకు సంబంధించి.. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, మూత్రపిండాల వ్యాధి, స్టెమ్ సెల్ మార్పిడి, సిర్రోసిస్, క్యాన్సర్, సికిల్ సెల్ వంటి వ్యాధులను పరిగణలోకి తీసుకుంటారు. 60 ఏళ్లు పైబడి.. ఇలాంటి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రికాషన్‌ డోసు తీసుకోవడానికి అర్హులు. 

ప్రికాషన్‌ డోసు కోసం ఎలా నమోదు చేసుకోవాలి..

60 ఏళ్ల పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రస్తుతం ఉన్న కో-విన్ (Co-WIN) అకౌంట్‌ ద్వారా ప్రికాషన్‌ డోసు కోసం నమోదు చేసుకోవచ్చు.

ఆన్-సైట్ లేదా కో-విన్ (Co-WIN) ఫెసిలిటేటెడ్ కోహోర్ట్ రిజిస్ట్రేషన్ విధానం ద్వారా ముందుస్తుగా ప్రికాషన్‌ డోసు కోసం నమోదు చేసుకోవచ్చు.

కో-విన్ (Co-WIN) సిస్టమ్‌లో నమోదైన రెండో డోస్ తీసుకున్న డేట్‌ను బట్టి ప్రికాషన్‌ డోసుకు అర్హత లభిస్తుంది. ఇక బుకింగ్‌ కోసం ఆధార్‌‌ను ఉపయోగించడం ద్వారా మీ ధ్రువీకరణ అనేది జరుగుతుంది. 

ఒకవేళ ఆధార్ లేకపోతే MoHFW ఆమోదించిన ఇతర ఐడీలను (ID) ఉపయోగించవచ్చు. 

1. ఓటర్ ఐడీ

2. పాస్‌పోర్ట్‌

3. డ్రైవింగ్ లైసెన్స్

4. పాన్ కార్డ్

5. ఎన్‌పీఆర్ (NPR) కింద ఆర్జీఐ (RGI) జారీ చేసిన స్మార్ట్ కార్డ్

6. ఫోటోగ్రాఫ్‌తో కూడిన పెన్షన్ డాక్యుమెంట్

అయితే కోవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారు ప్రికాషన్‌ డోస్‌కు అర్హులైతే, ఈ డోస్‌ కోసం మళ్లీ కోవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ను (Appointment‌) బుక్‌ చేసుకోవచ్చు. ప్రికాషనరీ డోస్‌ టీకా షెడ్యూల్స్‌ ఇప్పటికే ఓపెన్‌ అయ్యాయి. నిన్నటి నుంచే ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అలాగే జనవరి 10 నుంచి డైరెక్ట్‌గా వ్యాక్సినేషన్‌ సెంటర్‌‌కు వెళ్లి కూడా అపాయింట్‌మెంట్ బుక్‌ చేసుకోవచ్చు.

Also Read : Rajendra Prasad: కరోనాతో ఆసుపత్రిలో చేరిన నటుడు రాజేంద్ర ప్రసాద్

మొదటి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ అయితే తీసుకున్నారో అదే రకం వ్యాక్సినే ప్రికాషనరీ డోస్‌లో ఇస్తారు. రెండో డోసు పూర్తయి తొమ్మిది నెలలు గడిచిన వారు ఈ ప్రికాషన్‌ డోసు తీసుకోవడానికి అర్హులు. ప్రికాషన్‌ డోసు (Precautions‌ dose) తీసుకోవడం వల్ల కోవిడ్ నుంచి పుట్టుకొస్తున్న ఒమిక్రాన్‌లాంటి కొత్త వేరియెంట్‌ల నుంచి రక్షణ పొందొచ్చు. అంతేకాదు 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినకుండా ఈ బూస్టర్‌ డోసు (Booster dose) రక్షణ కల్పిస్తుంది.

Also Read : Mahesh Babu Emotional: ఎప్పటికీ నా అన్నయ్యవే.. రమేష్ బాబు మరణంపై మహేష్ ఎమోషనల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News