Covid-19: 2021లో ప్రారంభంలోనే కోవిడ్-19 వ్యాక్సిన్...కేంద్ర ఆరోగ్య మంత్రి స్పష్టత

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనావైరస్ ( Coronavirus ) టీకా కోసం అంతర్జాతీయంగా ఎన్నో సంస్థలు బాగా కష్టపడుతున్నాయి.

Last Updated : Oct 13, 2020, 01:35 PM IST
    • ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనావైరస్ టీకా కోసం అంతర్జాతీయంగా ఎన్నో సంస్థలు బాగా కష్టపడుతున్నాయి.
    • అమెరికా, భారత్ వంటి దేశాలు టీకా తయారీ విషయంలో, పంపిణీ విషయంలో ప్రణాళికలు వేస్తున్నాయి.
Covid-19: 2021లో ప్రారంభంలోనే కోవిడ్-19 వ్యాక్సిన్...కేంద్ర ఆరోగ్య మంత్రి స్పష్టత

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనావైరస్ ( Coronavirus ) టీకా కోసం అంతర్జాతీయంగా ఎన్నో సంస్థలు బాగా కష్టపడుతున్నాయి. అమెరికా, భారత్ వంటి దేశాలు టీకా తయారీ విషయంలో, పంపిణీ విషయంలో ప్రణాళికలు వేస్తున్నాయి. అదే సమయంలో భారత దేశ ( India ) ప్రజలకు వచ్చే ఏడాది ఆరంభం నుంచే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అని తెలిపారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్.

ALSO READ | UPSC Notification 2020: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

అప్పటి వరకు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ టీకాలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఆ సమయంలో వ్యాక్సిన్ ను ఎలా పంపిణి చేయాలి అనే అంశంపై కసరత్తు ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్టు ఆయన సమాచారం అందించారు. కోవిడ్-19 ( Covid-19 ) వ్యాక్సిన్ వస్తే దాన్ని ముందు ఎవరికి ఇవ్వాలి, ఎలా భద్రపరిచాలి అనే అంశాలపై అధికారులతో సమాలోచన చేస్తున్నట్టు తెలిపారాయన.

కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో ప్రస్తుతం నాలుగు సంస్థలు ముందంజలో ఉన్నాయి. దీంతో 2021లో ప్రారంభంలోనే టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అని తెలిపిన మంత్రి.. ఒక కంపెనీ వల్ల మొత్తం దేశానికి వ్యాక్సిన్ సరఫరా చేయడం సాధ్యం కాదన్నారు.

ALSO READ | UPSC Notification 2020: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News