India Covid-19 Update: దేశంలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న కరోనా కేసులు భారీగా తగ్గముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,734 మందికి (Corona Cases in India) వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మహమ్మారితో మరో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి మరో 17,897 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.49 శాతంగా నమోదైంది. నిన్న మరో 4,11,102 మందికి కరోనా టెస్టులు చేశారు.
భారత్ లో మెుత్తం కేసుల సంఖ్య 4,40,50,009కి చేరగా... టోటల్ మరణాలు 5,26,430గా ఉంది. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 4,33,83,787గా నమోదైంది. భారత్ లో ప్రస్తుతం 1,39,792 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం స్థిరంగా కొనసాగుతోంది. నిన్న 26,77,405 మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 204.60 కోట్లు దాటింది.
వరల్డ్ వైడ్ గా కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా 5,21,965 మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మారితో మరో 1,259 మంది ప్రాణాలు విడిచారు. జపాన్ లో అత్యధికంగా 1,96,812 కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో వైరస్ తో 78 మంది మరణించారు. అగ్రరాజ్యం అమెరికాలో 54,430 కేసులు వెలుగు చూడగా... మరణాల సంఖ్య 149గా ఉంది.
Also Read: Arpita Mukherjee Secret Life: అర్పితా ముఖర్జీ, పార్థ చటర్జీల గురించి డ్రైవర్ చెప్పిన రహస్యాలు
13,734 new COVID19 cases in India today; Active cases at 1,39,792 pic.twitter.com/NVRO566sqO
— ANI (@ANI) August 2, 2022
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook