Covid 19 Cases Updates: తగ్గుతున్న కరోనా కేసులు... 6 వేల మార్క్‌కి పడిపోయిన కొత్త కేసులు..

Covid 19 Cases Updates: దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య తక్కువగానే నమోదవుతోంది. కొద్దిరోజులుగా కొత్త కేసులు 10 వేలకు దిగువనే నమోదవుతున్నాయి.

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 9, 2022, 11:34 AM IST
  • కోవిడ్ 19 కేసుల అప్‌డేట్స్
  • క్రమంగా తగ్గుతున్న కొత్త కరోనా కేసులు
  • ఇవాళ్టి కేసుల వివరాలివే..
Covid 19 Cases Updates: తగ్గుతున్న కరోనా కేసులు... 6 వేల మార్క్‌కి పడిపోయిన కొత్త కేసులు..

Covid 19 Cases Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొద్దిరోజులుగా కొత్త కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6093 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 303 కేసులు తక్కువగా నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,44,84,729కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 31 మంది కరోనాతో మృతి చెందగా.. దేశంలో ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 5,28,121కి చేరింది. తాజాగా నమోదైన కరోనా మరణాల్లో 13 మరణాలు కేరళలోనే చోటు చేసుకోవడం గమనార్హం.

ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 49,636కి తగ్గింది. మొత్తం కేసుల్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 0.11 శాతంగా ఉంది. నిన్న 50,342 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా ఇవాళ 706 కేసులు తగ్గాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.93 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.88 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 3,16,504 కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 88.76 కోట్లకు చేరింది.

ప్రస్తుతం జాతీయ స్థాయిలో కోవిడ్ రికవరీ రేటు 98.70 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 6768 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ నమోదైన కోవిడ్ రికవరీల సంఖ్య 4,39,06,972కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 214.55 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇందులో 94.46 కోట్ల సెకండ్ డోసులు, 17.73 కోట్ల ప్రికాషన్ డోసులు ఉన్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఈ ఏడాది జూలైలో భారత్ 200 కోట్ల మార్క్‌ని చేరిన సంగతి తెలిసిందే. 

Also Read : 'Oke Oka Jeevitham' Review: ఇంటరెస్టింగ్ గా శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' రివ్యూ

Also Read: Brahmastra Twitter Review : బ్రహ్మాస్త్ర ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News