'కరోనా వైరస్' ఆడుతున్న మృత్యుకేళీ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 36 లక్షలు దాటింది. భారత దేశంలోనూ కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పటికీ పరిమిత ఆంక్షలు సడలించడంతో మళ్లీ కేసుల సంఖ్య ఉద్ధృతమవుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
భారత దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 46 వేల 433 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 32 వేల 134 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 12 వేల 727 మంది కరోనా మహమ్మారికి చికిత్స తీసుకుని సురక్షితంగా ఇంటికి వెళ్లారని వివరించింది. ఐతే కరోనా ధాటికి భారత దేశంలో 15 వందల 68 మంది మృతి చెందారని పేర్కొంది.
గత 24 గంటల్లో మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఉద్ధృతమైంది. నిన్న ఒక్కరోజే 3 వేల 900 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా నిన్న ఒక్కరోజే 195 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ఇప్పటి వరకు ఒక్క రోజులో మృతుల సంఖ్యలో ఇదే రికార్డ్ కావడం విశేషం. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.