కరోనావైరస్ (Coronavirus)ను మనిషే తయారు చేశాడా ? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదో హాట్ టాపిక్. చైనాలోని వుహాన్‌లో (Wuhan in china) కరోనావైరస్ పుట్టడమే ఈ సందేహాలకు కారణమైంది. ప్రపంచంలోనే నక్క జిత్తుల దేశంగా పేరున్న చైనానే అవసరమైతే శత్రు దేశాలపై దాడి చేసేందుకు కానీ లేదా ఇతర దేశాల్లోని మానవాళిపై ఈ వైరస్‌ని ప్రయోగించి.. ఆ తర్వాత బాధిత దేశాలకు కరోనా వైరస్‌కి (COVID-19) విరుగుడుగా వ్యాక్సిన్‌ని విక్రయించాలని చైనానే కుట్రపన్నుతోందని కొంతమంది అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. తద్వారా ప్రపంచ దేశాలను ఆరోగ్యం పరంగా, ఆర్థికంగా దెబ్బ తీయడంతో పాటు తాము ఆర్థికంగా మరింత బలపడొచ్చనేది చైనా కుట్రగా నెటిజెన్స్ వెలిబుచ్చుతున్న సందేహం.
Read also : కరోనా వైరస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చైనానే కరోనా వైరస్‌ను తయారు చేసిందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.. కరోనావైరస్ అనేది మానవసృష్టి కానేకాదని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కరోనావైరస్ అనేది చాలా మంది అనుమానిస్తున్నట్టుగా జెనెటిక్ ఇంజనీరింగ్‌తో పుట్టిన వైరస్ కాదని స్క్రిప్స్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనావైరస్ సహజంగానే ఏర్పడిందని స్క్రిప్స్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. నేచర్ మెడిసిన్ అనే జర్నల్‌లో ఈ అధ్యయనానిరకి సంబంధించిన ఫలితాలపై ఓ కథనాన్ని సైతం ప్రచురించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..