అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి.. వాట్సాప్‌లో పెళ్లి బాజాలు!

శుభకార్యాలపైనా కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తారని భావించి ముహూర్తాలు (WhatsApp Wedding) నిశ్చయించినవి కూడా వాయిదా పడ్డాయి.

Last Updated : Apr 17, 2020, 11:04 AM IST
అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి.. వాట్సాప్‌లో పెళ్లి బాజాలు!

WhatsApp Marriage In Kerala| దేశంలో లాక్‌డౌన్ కారణంగా జనాలు రోడ్లమీదకి వచ్చే పరిస్థితి లేదు. దీంతో అన్ని రంగాలపై ప్రభావం పడి ఆర్థిక కష్టాలతో కుదేలవుతున్నాయి. శుభకార్యాలపైనా కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తారని భావించి ముహూర్తాలు నిశ్చయించినవి కూడా వాయిదా పడ్డాయి. అక్కడక్కడా కొందరు బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నవారు సైతం ఉన్నారు. ఈ క్రమంలో వాట్సాప్ పెళ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరెన్సీ నోట్లతో కరోనా వ్యాపిస్తుందా ?

కేరళలోని ఆలయాల నగరంగా పేరుగాంచిన అలప్పుజలో వాట్సాప్ వీడియో కాలింగ్‌లో వివాహం జరుపుతున్నారు. కొట్టాయంలోని చంగనస్సెరీకి చెందిన ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి శ్రీజిత్ నటేశన్ (30)కి హరిపాద్‌లోని పల్లిపాడ్‌కు చెందిన అంజన (26) లక్నోలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. అంజన తండ్రి స్థానికంగా హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)లో ఉద్యోగం చేస్తున్నారు. వీరి జాతకాల ప్రకారం ఏప్రిల్ 26న పెళ్లి నిశ్చయించారు. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త

వాస్తవానికి ఏప్రిల్ 18న పల్లిపాడ్‌కు రావాలని పెళ్లికూతురు అంజన ప్లాన్ చేసుకుంది. వారం రోజులు పెళ్లి పనులు పూర్తి చేసుకుని నిర్ణయించిన ముహూర్తం ప్రకారం (ఏప్రిల్ 26 మధ్యాహ్నం 12.15 నుంచి 12.45 వరకు) వేడుకను జరిపించాలని భావించారు. కాగా, కరోనా వ్యాప్తి పెరడగంతో మే 3వరకు లాక్‌డౌన్ పొడిగించారు. దీంతో తొలుత పెళ్లిని వాయిదా వేసుకోవాలని భావించినట్లు వరుడు శ్రీజిత్ తెలిపాడు. ఐటమ్ గాళ్ నటాషా లేటెస్ట్ ఫొటోలు

అయితే తమ జాతకాల ప్రకారం ఇప్పుడు పెళ్లిని వాయిదా వేసుకుంటే మరో ముహూర్తం రెండు సంవత్సరాల తర్వాత ఉందన్నాడు.  దీంతో అనుకున్న ముహూర్తానికి అలప్పుజలో వాట్సాప్‌లో వీడియో కాల్ ద్వారా వీరి పెళ్లి జరపాలనుకున్నట్లు వెల్లడించాడు. పల్లిపాడ్‌లోని వధువు ఇంటికి వెళ్లి వరుడు శ్రీజిత్ సంప్రదాయం ప్రకారం వీడియో కాల్ ద్వారా అంజనను పెళ్లాడనున్నాడు. 

లక్నో నుంచి వాట్సాప్ వీడియో కాల్‌లో అంజన, ఆమె తల్లి, సోదరుడు జాయిన్ అవుతారు. ఆపై వీడియో కాలింగ్‌లో వధువు అంజన తన మెడను చూపిస్తుండగా.. పల్లిపాడ్‌లో శ్రీజిత్ మూడు ముళ్లు వేస్తాడు. లక్నోలో ఉన్న వధువు తాళిని మెడలో వేసుకుంటుంది. వాట్సాప్‌లో నిశ్చితార్థాలు చేసుకోవడం చూశాం, కరోనా దయ వల్ల ఇప్పుడు పెళ్లిళ్లు కూడా చూడాల్సి వస్తుందని నెటిజన్లు అంటున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

Trending News