కరోనా ఎఫెక్ట్: వరుసగా మూడోసారి..

స్టాక్ మార్కెట్ బుధవారం వరుసగా మూడో రోజు లాభపడింది. సెన్సెక్స్ 353.28 పాయింట్లు పెరిగి 41,142.66 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో 41,177 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ 109.50 పాయింట్లు పెరిగి 12,089.15 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 12,098 పాయింట్లకి చేరుకుంది. 

Last Updated : Feb 6, 2020, 10:39 PM IST
కరోనా ఎఫెక్ట్: వరుసగా మూడోసారి..

ముంబై : స్టాక్ మార్కెట్ బుధవారం వరుసగా మూడో రోజు లాభపడింది. సెన్సెక్స్ 353.28 పాయింట్లు పెరిగి 41,142.66 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో 41,177 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ 109.50 పాయింట్లు పెరిగి 12,089.15 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 12,098 పాయింట్లకి చేరుకుంది. 

కరోనావైరస్ చికిత్సలో క్లిష్టమైన పరిశోధనలో విజయం సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో కొనుగోళ్లను వేగవంతం చేసిందని విశ్లేషకులు తెలిపారు. దేశీయ రంగంలో సేవా రంగ కార్యకలాపాల వృద్ధి కూడా మార్కెట్‌కు తోడ్పడింది. 11 రంగాల సూచీలలో మెటల్ ఇండెక్స్ 3.12% పెరిగింది, మెటల్ స్టాక్స్ 6% లాభపడ్డాయి. రియాలిటీ ఇండెక్స్ 2.17% లాభపడింది. మీడియా సూచిక ఒక్కటే 0.77% కోల్పోయింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News