న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులను అదుపు చేయడం సాధ్యం కావడం లేదు. రోజురోజుకూ కోవిడ్19 తీవ్రత ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 28,701 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి సోమవారం ఉదయం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,78,254కు చేరింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 500 మంది కోవిడ్‌తో పోరాడుతూ చనిపోయారు. భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 23,174కు చేరింది. ఐశ్వర్యరాయ్‌కి కరోనా పాజిటివ్, జయా బచ్చన్‌కు నెగటివ్
మొత్తం కేసులకుగానూ ఇప్పటివరకూ 5,53,471 మంది చికిత్స అనంతరం కోవిడ్19 మహమ్మారి నుంచి కోలుకుని ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ కాగా, ప్రస్తుతం 3,01,609 యాక్టీవ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు జులై 13న ఉదయం హెల్త్ బులెటిన్ విడుల చేసింది. Corona Effect: తిరుపతిలో నేటి నుంచి కొత్త రూల్
ఓవైపు కరోనా మరణాలు పెరుగుతున్నా, కోవిడ్19 రికవరీ రేటు మాత్రం స్థిరంగా ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం భారత్‌లో రికవరీ రేటు 62.5గా ఉంది. తాజా కేసులలో మహారాష్ట్ర 7,827, తమిళనాడు 4,224 బాధితులతో కేవలం ఈ రెండు రాష్ట్రాల్లోనే 12 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం గమనార్హం. కరోనా కేసులలో అమెరికా, బ్రెజిల్ తర్వాత మూడో స్థానంలోనూ, కోవిడ్19 మరణాలలో 8వ స్థానంలో భారత్ కొనసాగుతోంది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..