'కరోనా వైరస్' .. చైనాతోపాటు ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తోంది. 'కరోనా వైరస్' దెబ్బకు ప్రపంచంలోని 80కి పైగా దేశాలు. . చిగురాటుకులా వణుకుతున్నాయి. ఇప్పటి కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు 4 వేల మంది మృత్యువాత పడ్డారు.
భారత్‌లోనూ క్రమక్రమంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు మొత్తంగా 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని 63 ఏళ్ల బామ్మకు కరోనా వైరస్ సోకింది. అటు కేరళలో 3 ఏళ్ల బాలునికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. వీరిద్దరితో తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరింది.
కేరళలో పాజిటివ్ లక్షణాలు ఉన్న 3 ఏళ్ల బాలునికి ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ పిల్లాడు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలుడు ఎర్నాకులంలోని మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు కరోనా వైరస్ పెద్ద వాళ్లకు రావడమే చూశాం. కానీ చిన్న పిల్లవానికి రావడం ఇదే తొలిసారి. బాలుడి నుంచి రక్త నమూనాలు సేకరించి అలెప్పీలోని NIV ల్యాబ్ కు పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుస్తుంది.
Read Also: సచిన్‌తో కిక్ బాక్సింగ్ చేస్తున్న బుడతడు ఎవరు..?
ఢిల్లీ, జైపూర్, ఆగ్రా, తెలంగాణ, లద్దాఖ్, తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లద్దాఖ్‌లో పాజిటివ్ లక్షణాలు కనిపించిన ఇద్దరు రోగులు.. ఇటీవలే ఇరాన్‌లో పర్యటించి వచ్చారు. అలాగే తమిళనాడులో ఒమన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. మరోవైపు తెలంగాణ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వ్యక్తి కోలుకుంటున్నాడు.
చైనా తర్వాత కరోనా వైరస్ మృతుల సంఖ్య అత్యధికంగా ఇటలీలో ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు 233 మంది కరోనా వైరస్ దెబ్బకు మృతి చెందారు. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..