Corona Updates in India: భారత్‌లో కోవడ్ కేసులు హెచ్చుతగ్గుల మధ్య నమోదు అవుతున్నాయి. రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతున్నా..యాక్టివ్ కేసులు కలవర పెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 10 వేల 725 కరోనా కేసులు రికార్డు అయ్యాయి. ఐతే క్రియాశీల కేసులు రెట్టింపు అవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 94 వేల 047 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇటు రికవరీ రేటు పెరుగుతోంది. తాజాగా 13 వేల 084 మంది రికవరీ అయ్యారు.
24 గంటల్లో 34 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు కరోనా వల్ల 5 లక్షల 27 వేల 488 మంది మృతి చెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4 కోట్ల 37 లక్షల 57 వేల 385 మంది కరోనా నుంచి జయించి వారియర్‌గా నిలిచారు. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. 210.82 కోట్ల డోసులను ఇదివరకు పంపిణీ చేశారు. ఈమేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
#COVID19 | India reports 10,725 fresh cases and 13,084 recoveries, in the last 24 hours; Active cases 94,047 pic.twitter.com/hqnDHS1Q4b
— ANI (@ANI) August 25, 2022
Also read:Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి, 14 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook