Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ చిన్నారులపై ప్రభావం ఉండదా..అన్నీ అవాస్తవాలేనా

Corona Third Wave: కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు అందరి ఆందోళన కరోనా థర్డ్‌వేవ్‌పై ఉంది. థర్డ్‌వేవ్ ఎక్కువగా చిన్నారుల్ని ప్రభావితం చేస్తుందని భావిస్తున్న తరుణంలో..ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ స్పష్టత ఇచ్చింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 24, 2021, 09:37 AM IST
Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ చిన్నారులపై ప్రభావం ఉండదా..అన్నీ అవాస్తవాలేనా

Corona Third Wave: కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు అందరి ఆందోళన కరోనా థర్డ్‌వేవ్‌పై ఉంది. థర్డ్‌వేవ్ ఎక్కువగా చిన్నారుల్ని ప్రభావితం చేస్తుందని భావిస్తున్న తరుణంలో..ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ స్పష్టత ఇచ్చింది.

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ (Corona Second Wave) నుంచి కోలుకోకముందే థర్డ్‌వేవ్ హెచ్చరికలు జారీ చేస్తోంది. అన్నింటికీ మించి థర్డ్‌వేవ్ ఎక్కువగా చిన్నారుల్ని టార్గెట్ చేస్తుందనే వార్తల నేపధ్యంలో ప్రజల్లో భయాందోళన మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. చిన్నారుల్ని థర్డ్‌వేవ్ అంతగా ప్రభావితం చేయదని అంటున్నారు. పిల్లల్లో పెద్దల మాదిరిగా వైరస్ త్వరగా వ్యాపించదని..అది పూర్తిగా వైరస్ ఉత్పరివర్తనాలపై ఆధారపడి ఉంటుందన్నారు. పిల్లల్లో వ్యాధి సంక్రమణను ఎదుర్కొనే అవకాశముందని..కానీ తీవ్రమైన వ్యాధి మాత్రం కాదని ఐఏపీ తెలిపింది. మొత్తానికి థర్డ్‌వేవ్ చిన్నారుల్ని ప్రభావిత చేసే అవకాశాలు చాలా తక్కువని తేలింది.

చిన్నారులు కరోనా ప్రభావానికి గురైనా..ఎక్కువగా లక్షణాల్లేకుండా ఉంటున్నారని..దాంతో కరోనా వాహకాలుగా మారుతున్నారని కేంద్రం ఇటీవల పేర్కొంది. త్వరలో వస్తుందనుకుంటున్న కరోనా థర్డ్‌వేవ్( Corona third wave)చిన్నారులపై ప్రభావం చూపుతుందా లేదా అనేది వైరస్ ఉత్పరివర్తనాలపై ఆధారపడి ఉంటుందని ఐఏపీ (IAP) తెలిపింది. ఐసీఎంఆర్ ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా వైరస్ సోకిన చిన్నారుల్లో చాలా తక్కువమందిలో లక్షణాలు కన్పిస్తాయని ఐఏపీ ప్రకటించింది. కోవిడ్ 19 వల్ల చిన్నారుల్లో మరణాలు చాలా అరుదుగా ఉంటాయని యూరప్‌లో నిర్వహించిన ఓ సర్వే కూడా సూచించింది. 

Also read: CBSE Board Exams: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు జూలైలో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News