India Reports 12,830 New COVID-19 Infections 446 Deaths in 24 hours: రోజు రోజుకు కరోనా కేసుల గణాంకాలతో హెచ్చు తగ్గులను గమనించవచ్చు. గత మూడు రోజుల నుండి కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి
గడచిన 24 గంటల్లో పాజిటివ్ సంఖ్యతో పాటు మరణాల సంఖ్య తగ్గింది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం... గడచిన 24 గంటల వ్యవధిలో (last 24 hours) కేసుల సంఖ్య 12,830 పెరగ్గా.. మృతుల సంఖ్య మాత్రం 446గా నమోదైంది. మంగళవారం 11,35,142 మందికి కరోనా (corona tests) పరీక్షలు చేయగా..... 12,830 మందికి కరోనా పాజిటివ్‌గా (corona positive) తేలింది.
Also Read: Huzurabad exit poll results: హుజూరాబాద్‌లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వివరాలు
#Unite2FightCorona#LargestVaccineDrive
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/OedDCFjEuS pic.twitter.com/ZPmBT87Mt9
— Ministry of Health (@MoHFW_INDIA) October 31, 2021
శుక్రవారం రోజు కేసుల సంఖ్య 14 వేలకు పైగా, మరణాలు 500కు పైగా నమోదయ్యాయి. కానీ శనివారం రోజున కేసులు 13 వేలకు దిగువన నమోదవ్వగా.. మరణాలు 446. ఫలితంగా కరోనా, మరణాలు పాజిటివ్ రెండింటి పరంగా తగ్గాయి అని చెప్పవచ్చు.
ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,58,186 చేరగా.. తాజాగా 14,667 మంది కరోనాను జయించారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3.36 కోట్లు దాటింది. వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో గత కొంతకాలంగా యాక్టివ్ కేసులు (Active cases) అదుపులో ఉన్నాయి. ప్రస్తుతం 1,59,272 యాక్టివ్ కేసులు ఉండగా... మొన్న 549 మరణాలు నమోదయ్యాయితే నిన్న వాటి మరణాల సంఖ్య 446కు తగ్గింది.
Also Read: Huzurabad exit poll results: హుజూరాబాద్‌లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వివరాలు
ఒకవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ (Vaccination) సజావుగా సాగుతోంది. ఇప్పటివరకు 1.06 కోట్లకుపైగా కరోనా టీకా డోసులు (doses) పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 68,04,806 లక్షల కోవిడ్ (Covid) వ్యాక్సిన్ వేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో రికవరీ రేటు 98.20 శాతానికి పైగా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి