Corona Fourth Wave: కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది.
దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ భయం వెంటాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, నోయిడాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు కరోనా ఫోర్త్‌వేవ్ భయాన్ని వ్యాపింపజేస్తున్నాయి. ముఖ్యంగా నోయిడా, ఢిల్లీల్లో చిన్నారుల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం కలకలం కల్గిస్తోంది. జూన్ చివరి వారం నాటికి దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభమై...సెప్టెంబర్ వరకూ ఉండవచ్చని ఇప్పటికే కాన్పూర్ ఐఐటీ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో కరోనా సంక్రమణ మళ్లీ పెరుగుతుండంతో ఫోర్త్‌వేవ్ భయం వెన్నాడుతోంది.
తాజాగా ఇండియాలో గత 24 గంటల్లో కరోనా కేసులు సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు కరోనా ఫోర్త్‌వేవ్ భయపెడుతోంది. ఒకరోజులో 1247 కొత్త కేసులు నమోదు కాగా, నిన్న అంటే గత 24 గంటల్లో 2 వేల 67 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య కూడా ఒక్కసారిగా భారీగా పెరిగింది. మొన్న ఒక్కరోజు 1 కరోనా మరణం వెలుగు చూస్తే..నిన్న ఒక్కసారిగా ఆ సంఖ్య 40కు చేరుకుని భయపెడుతోంది. కొత్తగా 1547 మంది కోరనా వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 12 వేల 340 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఒక్కరోజులోనే 40 కరోనా కేసులు వెలుగు చూడటంతో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. హర్యానా, మిజోరాం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో ఐదంచెల వ్యూహం అమలు చేయాలని సూచించింది.
Also read:
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook