RBI: ఆ బ్యాంకుల ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్

Cooperative banks under RBI: భారతదేశంలో ఉన్న కో- ఆపరేటీవ్ బ్యాంకులుకు చెందిన ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సుమారు 1540 కో ఆపరేటీవ్ బ్యాంకులను ఆర్బిఐ ( RBI ) పరిధిలోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ బ్యాంకుల్లో ఖాతాలున్న 8.6 కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది.

Last Updated : Jun 24, 2020, 07:50 PM IST
RBI: ఆ బ్యాంకుల ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్

Cooperative banks under RBI: భారతదేశంలో ఉన్న కో- ఆపరేటీవ్ బ్యాంకులుకు చెందిన ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సుమారు 1540 కో ఆపరేటీవ్ బ్యాంకులను ఆర్బిఐ ( RBI ) పరిధిలోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ బ్యాంకుల్లో ఖాతాలున్న 8.6 కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది. దాంతో పాటు వారి ఖాతాల్లో ఉన్న మొత్తం రూ. 4.84 లక్షల కోట్లు సురక్షితం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ( Prakash Javadekar) ఒక ప్రకటన చేశారు. 

ఈ బ్యాంకులను ఆర్బిఐ పరిధిలోకి తీసుకొచ్చే ఆర్డినెన్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. రాష్ట్రప్రతి ( President Of India ) ఈ ఆర్టినెన్స్‌పై సంతకం చేయాల్సి ఉంది అని.. తరువాత అది అమలులోకి వస్తుందన్నారు.

Trending News