Cement Block on Railway Track: తప్పిన ఘోర రైలు ప్రమాదం... ఒడిషా తరహా రైలు ప్రమాదానికి భారీ కుట్ర ?

Coimbatore - Mangalapuram Intercity Express Train Loco pilot: ఒడిషా రైలు ప్రమాదం దుర్ఘటన ఇంకా మర్చిపోకముందే దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. కేరళలోని కాసర్‌గడ్‌లో కోయంబత్తూరు - మంగళాపురం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పించి ప్రమాదం బారిన పడేలా గుర్తుతెలియని వ్యక్తులు కుట్రకు పాల్పడినట్టు సమాచారం అందుతోంది.

Written by - Pavan | Last Updated : Aug 18, 2023, 06:26 AM IST
Cement Block on Railway Track: తప్పిన ఘోర రైలు ప్రమాదం... ఒడిషా తరహా రైలు ప్రమాదానికి భారీ కుట్ర ?

Coimbatore - Mangalapuram Intercity Express Train Loco pilot: ఒడిషా రైలు ప్రమాదం దుర్ఘటన ఇంకా మర్చిపోకముందే దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. కేరళలోని కాసర్‌గడ్‌లో కోయంబత్తూరు - మంగళాపురం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పించి ప్రమాదం బారిన పడేలా గుర్తుతెలియని వ్యక్తులు కుట్రకు పాల్పడినట్టు సమాచారం అందుతోంది. కాసర్‌గడ్‌ - కన్‌హన్‌గడ్‌ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై సిమెంట్‌ దిమ్మెలు, రాళ్లు పెట్టినట్టు కోయంబత్తూరు - మంగళాపురం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు లోకోపైలట్‌ గుర్తించారు. రైలు ప్రమాదం బారిన పడేలా చేసేందుకు ఎవరో కావాలనే దురుద్దేశపూర్వకంగానే ఇలా రైలు పట్టాలపై సిమెంట్ దిమ్మెలు, రాళ్లను పడేసినట్టు సదరు లోకోపైలట్ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు.

లోకోపైలట్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సంబంధిత రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై రైల్వే పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్టు సమాచారం అందుతోంది. 

ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్టుగా కేరళ మీడియా సంస్థ మతృభూమి ఓ వార్తా కథనంలో పేర్కొంది. రైలు ప్రమాదంబారిన పడేలా దుష్టశక్తులు కుట్ర పన్నినప్పటికీ.. అదృష్టవశాత్తుగా కోయంబత్తూరు - మంగళాపురం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆ గండాన్ని దాటుకుని ముందుకు వెళ్లిపోయింది. పట్టాలపై పడేసి సిమెంట్ బ్లాక్స్, రాళ్లపై నుంచి రైలు ముందుకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన రైలు ప్రమాదాలపై అనేక అనుమానాలకు తావివ్వడమే కాకుండా ఇలా జరిగితే ఇక రైలు ప్రయాణాలకు ఎంత మేరకు భద్రత ఉంటుంది అనే సవాళ్లను సైతం లేవనెత్తుతోంది. 

ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?

కోయంబత్తూరు - మంగళాపురం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఘటనపై శుక్రవారం రైల్వే శాఖ ఎలా స్పందించనుంది ? ఏం ప్రకటన చేయనుంది ? స్థానిక రైల్వే అధికారులు, రైల్వే పోలీసుల విచారణలో అసలు ఏం తేలనుంది ? ఈ భారీ కుట్రకు పాల్పడే అవసరం ఎవరికి ఉంది ? అసలు ఈ పని చేసింది ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోయంబత్తూరు - మంగళాపురం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఘటన అనేదే ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. ఇంత పెద్ద ఘటనకు సంబంధించి రైల్వే శాఖ వద్ద పెద్దగా సమాచారం లేకపోవడం కానీ లేదా రైల్వే శాఖ స్పందించకపోవడం కానీ గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటికే దేశంలో జరిగిన పలు రైలు ప్రమాదాల వెనుక కుట్ర కోణాలు ఏమైనా దాగి ఉన్నాయా అనే అనుమానాలు ఇంకా వీడక ముందే జరిగిన ఈ ఘటన అనేక సందేహాలకు తావిస్తోంది.

ఇది కూడా చదవండి : Hyundai Cars Discount Mela: కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. హ్యూందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News