అర్ధరాత్రి ప్యాంట్‌లో ఏదో కదులుతోందని చూసి షాకయ్యాడు.. వైరల్ వీడియో

Cobra enters man's pants: మీర్జాపూర్: నాగుపాము పేరెత్తితేనే కొంతమందికి వణుకు పుడుతుంది.. ఇంకొంతమందికి దానిని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతారు. మరి అదే నాగుపాము ఒకవేళ ప్యాంట్‌లోకి చొరబడిందని తెలిస్తే.. అతడి పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి... ఏంటి ఊహకు కూడా అందడం లేదు కదా!

Last Updated : Aug 4, 2020, 04:39 PM IST
అర్ధరాత్రి ప్యాంట్‌లో ఏదో కదులుతోందని చూసి షాకయ్యాడు.. వైరల్ వీడియో

Cobra enters man's pants: మీర్జాపూర్: నాగుపాము పేరెత్తితేనే కొంతమందికి వణుకు పుడుతుంది.. ఇంకొంతమందికి దానిని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతారు. మరి అదే నాగుపాము ఒకవేళ ప్యాంట్‌లోకి చొరబడిందని తెలిస్తే.. అతడి పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి... ఏంటి ఊహకు కూడా అందడం లేదు కదా!! ఐతే ఇదిగో ఉత్తర్ ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో నిజంగానే జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకోండి. లవ్‌కేష్ కుమార్ అనే యువకుడు ఊర్లో జరుగుతున్న ఓ ఎలక్ట్రికల్ వర్క్ ముగించుకుని వచ్చి రాత్రిపూట సేదతీరేందుకని అంగన్వాడి కేంద్రం ఆవరణలోని వసారాలో పడుకున్నాడు. అతడితోపాటే తోటి కార్మికులు కూడా ఉన్నారు. ఉన్నట్టుండి అర్ధరాత్రి వేళ తన ప్యాంట్‌లో ఏదో కదులుతున్నట్టు అనిపించి మెలకువ వచ్చింది. ఏంటా అని చూసి షాకయ్యాడు. జీన్స్ ప్యాంట్లోకి నాగుపాము పోయిందని తెలిసిన మరుక్షణం లవ్‌కేష్ కుమార్‌కి ఊపిరాడలేదు. Also read: Mystery Seeds: చైనా నుంచి విత్తనాల కొరియర్లు.. చైనా మరో కుట్ర చేస్తోందా ?

వెంటనే తన తోటి స్నేహితులను నిద్ర లేపాడు. అతడూ లేచి నిలబడ్డాడు. కాస్త కదిలినా పాము ఎక్కడ కాటేస్తుందోననే భయంతో ఆ రాత్రంతా అలాగే గడిపేశాడు. ఆ అర్థరాత్రే స్నేహితులు ఊర్లో ఎవరైనా పాములు పట్టే వాళ్లు ఉన్నారా అని వెతుకుతూ వెళ్లారు. కానీ తెల్లవారే వరకు వారికి ఎవ్వరి జాడ దొరకలేదు. తెల్లవారిన తర్వాత పాములు పట్టే వారితో పాటు అత్యవసర వైద్యం కోసం ఓ అంబులెన్స్‌ని కూడా తీసుకొచ్చారు. నెమ్మదిగా లవ్‌కేశ్ ప్యాంట్ కత్తిరించి పామును బయటికి తీశారు. అదృష్టవశాత్తుగా పాముకు కానీ పాము నుంచి అతడికి ఎలాంటి అపాయం జరగలేదు. 7 గంటల పాటు అలాగే నిలబడినందుకు అతడి ధైర్యాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారు ఆ ఊరి గ్రామస్తులు. Also read: SSR death case: మహా సర్కార్‌కి బీహార్ సర్కార్ నుంచి మరో షాక్

Trending News