Voter ID: ఓటు నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘం(ECI) కీలక విషయాన్ని వెల్లడించింది. ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయస్సుపై క్లారిటీ ఇచ్చింది. ఇక నుంచి 17 ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు పొందవచ్చు. ఈమేరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది. ఓటు హక్కు కోసం యువత 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడనవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఇప్పటివరకు జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారికే ఓటరు జాబితాలో నమోదుకు అర్హులుగా ఉన్నారు. తాజాగా 17 ఏళ్ల వారందరికీ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం దొరికొంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్‌తోపాటు ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్రపాండే వెల్లడించారు. ఇందులోభాగంగానే ముందస్తుగా ఓటరు నమోదుకు అవసరమైన సాంకేతికతను అందుబాటులో ఉంచాలని అన్ని రాష్ట్రాల్లోని ఎన్నికల అధికారులను ఆదేశించారు.
మరోవైపు ఓటరు కార్డు-ఆధార్ సంఖ్య అనుసంధాన ప్రక్రియ ప్రారంభించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని..స్వచ్ఛందంగానే చేసుకోవచ్చని తేల్చి చెప్పింది. ఇటు కేంద్ర ప్రభుత్వం సైతం క్లారిటీ ఇచ్చింది. ఓటు వేసేందుకు ఆధార్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
More opportunities for youth to become part of voters list; Four chances in a year to enroll - need not wait for 1st January qualifying date only
Details: https://t.co/HMehGN4GEB
1/2 pic.twitter.com/HG4NKgxmcB
— PIB India (@PIB_India) July 28, 2022
Also read:Minister Malla Reddy: మూడు నెలల క్రితం MLA స్టిక్కర్ పడేశాడట!.. మంత్రి మల్లారెడ్డి కవరింగ్ అదుర్స్..
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోమారు వర్ష సూచన..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook