Cinema Halls reopening: రేపే థియేటర్స్ రీఓపెన్..

కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus pandemic ) అరికట్టేందుకు లాక్ డౌన్ విధించడంతో మార్చి నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఐతే ఇటీవల అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు ( Unlock 5.0 guidelines ) విడుదల చేసిన కేంద్రం.. అక్టోబర్ 15 తర్వాత పలు వెసులుబాటులు కల్పించింది.

Last Updated : Oct 14, 2020, 11:18 PM IST
Cinema Halls reopening: రేపే థియేటర్స్ రీఓపెన్..

న్యూ ఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus pandemic ) అరికట్టేందుకు లాక్ డౌన్ విధించడంతో మార్చి నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఐతే ఇటీవల అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు ( Unlock 5.0 guidelines ) విడుదల చేసిన కేంద్రం.. అక్టోబర్ 15 తర్వాత పలు వెసులుబాటులు కల్పించింది. అందులో భాగంగానే అక్టోబర్ 15 తర్వాత సినిమా థియేటర్స్ పునఃప్రారంభించే ( Theatres reopening ) స్వేచ్చను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వడంతో రేపు గురువారం నుండి సినిమా హాల్స్ తెరిచేందుకు ఢిల్లీ సర్కార్ అనుమతించింది. Also read : Ashima Narwal smoking video: స్మోకింగ్ చేస్తూ బాలయ్య బాబు డైలాగ్ చెప్పిన హీరోయిన్

ఈ సందర్భంగా తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Delhi CM Arvind Kejriwal ).. ఢిల్లీ పరిధిలోని సినిమా హాల్స్ అసోసియేషన్ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. థియేటర్స్ పునఃప్రారంభం విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం ( Delhi govt ) విడుదల చేసిన కొవిడ్-19 నిబంధనలను సినిమా హాల్స్ యజమానులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సోషల్ డిస్టన్సింగ్, శానిటైజేషన్ ప్రోటోకాల్స్‌ని ( Social distancing, Sanitization ) విధిగా పాటించాలని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి గత ఏడు నెలలుగా కరోనాతో పోరాటంలోనే గడిచిపోయిందని తెలిపారు. పీవీఆర్, ఐనాక్స్ ( PVR, Inox ) వంటి మల్టిప్లెక్స్ థియేటర్స్ ప్రతినిధులు సహా ఇతర మల్టీప్లెక్సులు, థియేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. Also read : EPFO: పీఎఫ్ ఖాతాదారులకు సరికొత్త సర్వీసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News