భారత దేశంపై పొరుగు దేశాలు చైనా, పాకిస్తాన్ కుట్రలకు పాల్పడుతున్నాయి. ఇండియాపై సైబర్ దాడుల కోసం ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఈ రెండు దేశాల నుంచి హ్యాకర్లు భారత వెబ్ సైట్లపై విరుచుకుపడుతున్నారు. మొత్తంగా లక్ష వెబ్ సైట్లను హ్యాక్ చేసేందుకు వ్యూహం సిద్ధం చేశారు.
2015 నుంచి ఈ సైబర్ దాడికి కుట్రలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ ఐదేళ్లలో దాదాపు లక్షా 29 వేల 747 భారత వెబ్ సైట్లపై సైబర్ దాడులు జరిగాయని తెలిపింది. హ్యాకింగ్ ద్వారా భారత భద్రతకు ముప్పు ఏర్పడుతోందని వివరించింది. కానీ ఎప్పటికప్పుడు విదేశీ హ్యాకర్లను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్... CERT-In ఎదుర్కుంటోందని వెల్లడించింది.
Read Also: హిందూ, ముస్లింలకు వేర్వేరు బిర్యానీ..!! ఎందుకు..?
చైనా, పాకిస్తాన్ మాత్రమే కాకుండా ఫ్రాన్స్, నెదర్లాండ్స్, రష్యా, సైబీరియా, తైవాన్, ట్యునీషియా లాంటి దేశాల నుంచి కూడా హ్యాకర్లు భారత వెబ్ సైట్లపై హ్యాకింగ్ కు పాల్పడుతున్నారు. 2015లో 27 వేల 205 వెబ్ సైట్లు, 2016లో 33వేల వెబ్ సైట్లు, 2017లో 30 వేల 067, 2018లో 17 వేల 560, 2019లో 21 వేల 767 వెబ్ సైట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి.
భారత సైబర్ సెక్యూరిటీ బలంగా ఉండడం వల్ల... ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరోవైపు సైబర్ సెక్యూరిటీ కోసం ఇప్పటి వరకు 44 మాక్ డ్రిల్స్ నిర్వహించారు.
Read Also: ఆకట్టుకుంటున్న 'ఉప్పెన' పాట
భారత్‌పై సైబర్ కుట్ర