జాబ్ ఇస్తామని చెప్పి.. మొబైల్ దొంగని పట్టుకున్నారు..!

చెన్నై పురసాయ్‌వక్కం ప్రాంతంలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు, సిమ్ మార్చడానికి ఎయిర్ టెల్ షోరూమ్‌కి వెళ్లగా అక్కడే తన ఐఫోన్ పోగొట్టుకున్నాడు. 

Last Updated : Jun 22, 2018, 02:05 PM IST
జాబ్ ఇస్తామని చెప్పి.. మొబైల్ దొంగని పట్టుకున్నారు..!

చెన్నై పురసాయ్‌వక్కం ప్రాంతంలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు, సిమ్ మార్చడానికి ఎయిర్ టెల్ షోరూమ్‌కి వెళ్లగా అక్కడే తన ఐఫోన్ పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత షోరూమ్ ఫుటేజీలను పరీక్షించగా ఓ వ్యక్తిపై తనకు అనుమానం తలెత్తింది. ఆ వ్యక్తే తన ఐఫోన్ దొంగతనం చేసుంటాడని నిర్థారణకు వచ్చాడు. ఇదే విషయమై పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోకపోవడంతో తన స్నేహితుడి సహాయం తీసుకున్నాడు.

ఈ స్నేహితులిద్దరూ తొలుత దొంగను పట్టుకోవడానికి ప్లానింగ్ ప్రకారం ఒక స్కెచ్ వేశారు. ఎయిర్ టెల్ షోరూమ్‌కు ముందు ఆ దొంగ ఎందుకు వచ్చాడో తెలుసుకున్నారు. మొబైల్ రిపేర్ చేయించడానికి ఆ వ్యక్తి వచ్చాడని.. ఆ తర్వాత షోరూమ్ కౌంటర్ వద్ద తన పేరు, ఫోన్ నెంబరు ఇచ్చాడని తెలుసుకొని.. షాపు వారిని ఆ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆ స్నేహితులు.

కానీ ఆ నెంబరు బిహార్ నెట్వర్క్‌కి సంబంధించింది అని తెలిసింది. పైగా యాక్టివేట్ కూడా అవ్వలేదు. తర్వాత ఆ మొబైల్ నెంబరుకి ఫోన్ చేసి మాట్లాడాలని ప్రయత్నించగా అడియాశే మిగిలింది. ఈ ప్రయత్నంలో ఆ వ్యక్తిని పేరు ద్వారా ఫేస్ బుక్ ఆధారంగా ట్రాక్ చేయాలని భావించారు స్నేహితులు.

ఆ తర్వాత మెసేంజర్ ద్వారా వేరే స్నేహితుడి ద్వారా జాబ్ ఆఫర్ ఉందని ఎఫ్‌బీలోనే ఆ దొంగకు ఫేక్ మెసేజ్ పెట్టించారు. ఇంటర్వ్యూ,  జీతం మొదలైన విషయాలు కూడా మెసేజ్ చేశారు. ఆ తర్వాత రెస్యూమ్ పంపించమని తెలిపారు. అలా వచ్చిన రెస్యూమ్ నుండి నెంబరు తీసుకొని.. తన స్నేహితుడితో మాట్లాడించి మాధవరంలో ఇంటర్వ్యూ ఫిక్స్ చేస్తున్నామని తెలిపారు.

తర్వాత ఏ మాత్రం అనుమానం రాకుండా ఆ దొంగను అదే ప్రాంతంలో ప్లానింగ్ ప్రకారం పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పూర్తిగా సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఫేస్ బుక్ వివరాలు ఆధారంగా ఐఫోన్ దొంగను పట్టుకోవడంతో పోలీసులే విస్తుపోయారు. ఆ స్నేహితులను అభినందించారు. 

Trending News