ఐపీఎల్ మ్యాచ్ పై విరుచుకుపడ్డ తమిళ ప్రజాసంఘాలు

తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐపీఎల్ మ్యాచ్ నిర్వాహకులపై విరుచుకుపడ్డాయి. కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు సమస్య పై తాము ఒక వైపు పోరాడుతుంటే.. ఇప్పుడు చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడమా? అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Last Updated : Apr 10, 2018, 09:15 PM IST
ఐపీఎల్ మ్యాచ్ పై విరుచుకుపడ్డ తమిళ ప్రజాసంఘాలు

తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐపీఎల్ మ్యాచ్ నిర్వాహకులపై విరుచుకుపడ్డాయి. కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు సమస్య పై తాము ఒక వైపు పోరాడుతుంటే.. ఇప్పుడు చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడమా? అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు చెన్నైలో చిదంబరం స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించేవరకూ ఇక్కడ ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించవద్దని.. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వమని ఇప్పటికే తమిళనాడులోని పలు సంఘాలు ఐపీఎల్ నిర్వాహకులకు తెలిపాయి. అయితే వారు స్పందించకపోవడంతో ప్రస్తుతం చిదంబరం స్టేడియం బయట ఎందరో ఆందోళనకారులు గుమిగూడారు. ప్రభుత్వానికి, ఐపీఎల్ నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు

స్టేడియం బయట ఆందోళనలు..
మంగళవారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లు మొత్తం అమ్ముడైపోయాయి. ఈ క్రమంలో ఐపీఎల్ నిర్వాహకులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించేవారిని, ప్రమాదకరమైన వస్తువులతో వచ్చేవారిని స్టేడియంలోకి అనుమతించవద్దని చెకింగ్ సిబ్బందికి తెలిపారు.

అయినా సరే... భారీ సంఖ్యలో ఉద్యమకారులు స్టేడియం బయట ధర్నాలకు దిగారు. "మాకు ఐపీఎల్ వద్దు..కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు కావాలి" అని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా హోంశాఖ కార్యదర్శితో మాట్లాడారు. చెన్నైలో భద్రతా ఏర్పాట్లు చేయవల్సిందిగా పోలీసులకు సూచించమని కోరారు. అలాగే మ్యాచ్‌లను చెన్నై నుండి షిఫ్ట్ చేసేది లేదని తెలిపారు. 

రజనీకాంత్ నుండి కూడా వ్యతిరేకత
తమిళనాడులో ప్రజలు ఒక ప్రధానమైన సమస్యపై పోరాడుతున్న సందర్భంలో.. అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడంపై సినీనటుడు రజనీకాంత్ కూడా తన వ్యతిరేకతను తెలిపారు. ముఖ్యంగా చెన్నై జట్టు ఆటగాళ్లు ఐపీఎల్ ఆడరాదని ఆయన తెలిపారు. ఒకవేళ ఆడాలనుకుంటే... నల్ల బ్యాడ్జీలు ధరించి ఆడాలని ఆయన సూచించారు. 

Trending News