Punjab New CM: పంజాబ్ సీం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. చరణ్‌జిత్ సింగ్ చన్నీ (47) పేరును కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. చరణ్‌జిత్ సింగ్(Charanjit Singh Channi) ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి హరీశ్ రావత్(Harish Rawat) ఆదివారం ట్విటర్ వేదికగా ప్రకటించారు. కాసేపట్లో కొత్త సీఎల్పీ నాయకుడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్(Bhanwarilal Purohit) కలవనున్నారు.
It gives me immense pleasure to announce that Sh. #CharanjitSinghChanni has been unanimously elected as the Leader of the Congress Legislature Party of Punjab.@INCIndia @RahulGandhi @INCPunjab pic.twitter.com/iboTOvavPd
— Harish Rawat (@harishrawatcmuk) September 19, 2021
కెప్టెన్ రాజీనామా తర్వాత తదుపరి సీఎం విషయంలో పలు పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్, ప్రతాప్ సింగ్ బజ్వా, మాజీ సీఎం రాజేందర్ కౌర్ భట్టల్, సుఖ్‌జిందర్(Sukhjinder Randhawa) పేర్లు వినిపించాయి. ఒక దశలో సుఖ్‌జిందర్ పేరును ఖరారు చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ అక్కడికి కొద్ది గంటల్లోనే అనూహ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చరణ్‌జిత్ పేరును కాంగ్రెస్(Congress) పార్టీ ఖరారు చేసింది.
Also Read: Breaking News: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరిందర్ సింగ్
1973 ఏప్రిల్ 2న జన్మించిన జన్మించిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. చామ్‌కౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015-2016 మధ్య అసెంబ్లీలో కాంగ్రెస్ తరఫున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవవహరించారు. అమరీందర్ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
కెప్టెన్-సిద్ధూ మధ్య విభేదాలు
తాజా మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాల కారణంగా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తలెత్తిన సంగతి తెలిసిందే. మరోవైపు అధిష్టానం కూడా కెప్టెన్ రాజీనామాకే మొగ్గు చూపిందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్(Amarinder Singh) శనివారం రాజీనామా చేశారు. ఆయనతో పాటు మంత్రులు కూడా గవర్నర్‌కు రాజీనామా సమర్పించగా ఆయన ఆమోదించారు.
తదుపరి సీఎంగా పీసీసీ చీఫ్ సిద్ధూ(Navjot Singh Sidhu)ను అంగీకరించేది లేదని అమరీందర్ సింగ్ ఇప్పటికే తేల్చిచెప్పారు. సిద్ధూకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని.. ఆయన సీఎం కావడం దేశ భద్రతకు విఘాతమని శనివారంనాడు తీవ్ర ఆరోపణలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook