Chandrashekhar Guruji Murder: చంద్రశేఖర్ గురూజీ మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్.. స్పందించిన సీఎం

Chandrashekhar Guruji Murder Case: కర్ణాటకలోని హుబ్బలిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ హోటల్లో బస చేస్తోన్న చంద్రశేఖర్ గురూజీ అనే వాస్తు శాస్త్ర నిపుణుడిని ఇద్దరు దుండగులు అదే హోటల్ రిసెప్షన్ వద్ద కత్తితో అతి కిరాతకంగా పొడిచి చంపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 5, 2022, 09:08 PM IST
  • కర్ణాటకలోని హుబ్బలిలో వాస్తు శాస్త్ర నిపుణుడి మర్డర్
  • హోటల్ రిసెప్షన్ వద్దకు పిలిచి మరీ అఘాయిత్యం
  • హోటల్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు
Chandrashekhar Guruji Murder: చంద్రశేఖర్ గురూజీ మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్.. స్పందించిన సీఎం

Chandrashekhar Guruji Murder Case: కర్ణాటకలోని హుబ్బలిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ హోటల్లో బస చేస్తోన్న చంద్రశేఖర్ గురూజీ అనే వాస్తు శాస్త్ర నిపుణుడిని ఇద్దరు దుండగులు అదే హోటల్ రిసెప్షన్ వద్ద కత్తితో అతి కిరాతకంగా పొడిచి చంపారు. హోటల్లో ఉన్న చంద్రశేఖర్ గురూజీని రిసెప్షన్ లాబీ వద్దకు పిలిపించిన దుండగులు.. అతడు వస్తుండటంతోనే కత్తితో పొడిచి పరారయ్యారు. చంద్రశేఖర్‌ని ఆస్పత్రికి తరలించేటప్పటికే అతడు మృతి చెందారని హుబ్బలి పోలీస్ కమిషనర్ లభురామ్ వెల్లడించినట్టు ఏఎన్ఐ పేర్కొంది. 

చంద్రశేఖర్ గురూజీ హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడి హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కర్ణాటక పోలీసులు నిందితులను పట్టుకున్నారు. బెళగావి జిల్లాలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు గల కారణాలు ఏంటనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. 

చంద్రశేఖర్ గురూజీ హత్యపై కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై స్పందించారు. చంద్రశేఖర్ హత్యను అతి కిరాతకమైన ఘటనగా అభివర్ణించిన సీఎం బస్వరాజ్.. నిందితులను అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా హుబ్బలి పోలీసు కమిషనర్‌ని ఆదేశించినట్టు తెలిపారు. 

అసలు ఎవరీ చంద్రశేఖర్ గురూజీ..
కర్ణాటకలోని బగల్‌కోట్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్.. ముందుగా ఒక కాంట్రాక్టర్‌గా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత అదే పరిచయాలతో ముంబైలో ఒక ఉద్యోగంలో చేరారు. ఉద్యోగరీత్యా ముంబైలోనే స్థిరపడిన చంద్రశేఖర్.. అదే సమయంలో వాస్తు శాస్త్రంలోనూ ప్రావిణ్యం పొందారు. అలా ముంబై, కర్ణాటకలో ప్రముఖ వాస్తు నిపుణుడిగా పేరొందారు. మూడు రోజుల క్రితం హుబ్బలిలో తమ కుటుంబంలోనే ఒకరు చనిపోవడంతో ఆ కార్యక్రమాలకు వచ్చి హోటల్లో బస చేశారు. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ కదలికలపై కన్నేసిన దుండగులు అతడిని అక్కడే హతమార్చారు.

Also read : Selling Chicken On Hindu Diety Papers: హిందూ దేవుళ్ల ఫోటోలున్న పేపర్ మీదే చికెన్ అమ్మకం.. పోలీసుల మీద దాడి.. యూపీలో వ్యక్తి అరెస్ట్!

Also read : Leena Manimekalai: సిగరెట్ తాగుతున్న కాళీ మాత.. వివాదాస్పదమవుతోన్న పోస్టర్.. డైరెక్టర్ అరెస్ట్‌కు నెటిజన్ల డిమాండ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News