Attack on jp nadda: దాడిపై విచారణకు ఆదేశించిన హోంమంత్రి అమిత్ షా, 12 గంటల్లో నివేదిక సమర్పించాల్సిందే

Attack on jp nadda: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై పశ్చిమ బెంగాల్‌లో జరిగిన దాడిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ విచారణకు ఆదేశించారు. 

Last Updated : Dec 10, 2020, 07:50 PM IST
  • జేపీ నడ్డాపై దాడిని ఖండించిన అమిత్ షా..విచారణకు ఆదేశం
  • 12 గంటల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన అమిత్ షా
  • బీజేపీ నాటకాలాడుతోందని..తమ ప్రభుత్వం విచారణ చేయిస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
Attack on jp nadda: దాడిపై విచారణకు ఆదేశించిన హోంమంత్రి అమిత్ షా, 12 గంటల్లో నివేదిక సమర్పించాల్సిందే

Attack on jp nadda: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై పశ్చిమ బెంగాల్‌లో జరిగిన దాడిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ విచారణకు ఆదేశించారు. 

2021లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్ని( West bengal assembly elections ) దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ( Bjp chief jp nadda ) పార్టీని సన్నద్ధం చేసేందుకు ఆ రాష్ట్రంలో పర్యటన చేపట్టారు. రాష్ట్ర రాజధాని కోల్‌త్తాకు 50 కిలోమీటర్ల దూరంలో..జేపీ నడ్డా కాన్వాయ్ ( Attack on jp nadda convoy )‌పై దాడి జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( central minister amit shah ) ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. దాడిపై విచారణకు ఆదేశించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా 12 గంటల్లో నివేదిక ఇవ్వాలని కోరారు.  

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ( TMC ) కార్యకర్తలే ఈ దాడి చేశారని బీజేపీ ( BJP ) ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో బీజేపీ నేత ముకుల్ రాయ్‌కు గాయాలయ్యాయి. కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. 

Also read: New parliament: ప్రస్తుత పార్లమెంట్ భవనంపై మోదీ ప్రశంసలు

ఇవాళ బెంగాల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై జరిగిన దాడి ఆక్షేపణీయమని..ఎంత ఖండించినా తక్కువేనని..కేంద్ర ప్రభుత్వం ఈ దాడిని సీరియస్‌గా తీసుకుంటుందని..బెంగాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన దాడికి రాష్ట్రంలోని శాంతి ప్రియులు సమాధానం చెప్పాలని అమిత్ షా ట్వీట్ చేశారు.  

అదృష్టవశాత్తూ జేపీ నడ్డా ప్రయాణిస్తున్న కారు బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ఆయనకు గాయాలు కాలేదు. మరో కారులో ఉన్న బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గీయ్‌కు గాయాలయ్యాయి. దుర్గా మాత దయ వల్ల తాను మీటింగ్‌కు రాగలిగానని జేపీ నడ్డా తెలిపారు. మరోవైపు ఈ దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది పార్టీ. 

మరోవైపు ఈ దాడి వ్యవహారమంతా నాటకమని..తమ మీద తామే దాడి చేసుకుని..తమను నిందిస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  ( Cm Mamata Banerjee ) విమర్శించారు. ఈ ఘటనపై బెంగాల్ ప్రభుత్వం ( Bengal Government ) విచారణ జరుపుతుందన్నారు. కేవలం ఉద్దేశ్యపూర్వకంగా చేసిందా లేదా మరేదైనా కుట్ర దాగుందా అనే కోణంలో సైతం దర్యాప్తు చేస్తామన్నారు. మరోవైపు జేపీ నడ్డా భద్రతపై ఆ పార్టీ నేతలు పోలీసుల్ని అడగలేదని మమతా తెలిపారు. Also read: Farmers strike: రైతుల సమ్మె వెనుక పాక్, చైనా కుట్ర దాగుంది: కేంద్రమంత్రి

Trending News