Vaccine Policy: కరోనా వ్యాక్సిన్ విధానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాల్ని విడుదల చేసింది. వ్యాక్సిన్ కంపెనీల నుంచి ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ కొత్త నిబంధనలు జారీ చేసింది.
కరోనా వ్యాక్సిన్ విధానం(Vaccine Policy)లో మార్పులు వస్తూనే ఉన్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ, వ్యాక్సిన్ కొనుగోలు, రాష్ట్రాలకు కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాల్ని జారీ చేస్తోంది.దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియ కొనసాగుతుంటే..కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్లకు కొరత ఏర్పడుతోంది. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో కొన్నిచోట్ల వ్యాక్సిన్ కొరత ఏర్పడుతుంటే..ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లు నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ వ్యర్ధం కాకుండా నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central government) మరోసారి కొత్తగా మార్గదర్శకాల్ని జారీ చేసింది. కంపెనీల నుంచి వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేయడానికి వీల్లేదని..ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిన్ ప్లాట్‌ఫామ్(Covin Platform)నుంచి మాత్రమే ఆర్డర్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. నెలవారీ కొనుగోళ్లపై పరిమితి విధించింది. జూలై 1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. వ్యాక్సిన్ల ఆర్డర్లకు నేషనల్ హెల్త్ అథారిటీ పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్ విధానంలో మాత్రమే చెల్లింపులు చేయాలని సూచించింది. ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ సరఫరా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలో జరుగుతుందని స్పష్టం చేసింది.
ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజువారీ వ్యాక్సిన్ వినియోగాన్ని బట్టి ఎన్ని డోసులకు ఆర్డర్ ఇవ్వాలనేది కేంద్రమే నిర్ణయించనుంది. గతంలో అంటే జూన్ 21 నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు 25 శాతం వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు అనుమతి ఉంది. ఈ విధానం వల్ల చాలావరకూ వ్యాక్సిన్లు ప్రైవేటు ఆసుపత్రుల్లో వృధా పోతున్నాయి. అందుకే ఇప్పుడు మరోసారి మార్గదర్శకాల్ని మార్చింది. జూన్ నెలలో వినియోగాన్ని బట్టి జూలైలో ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుంది.
Also read: Covovax: సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు షాక్, చిన్నారులపై కోవొవాక్స్ క్లినికల్ ట్రయల్స్‌కు నో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook