నేపాల్ -చైనా సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ చర్యలు ముమ్మరం చేశారు. భారత యాత్రికులను కాపాడేందుకు నేపాల్ ప్రభుత్వాన్ని ఆర్మీ హెలికాప్టర్లు ఇవ్వాలని కోరామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. నేపాల్‌లోని భారత ఎంబసీ కార్యాలయం తమ ప్రతినిధులను పంపిందని తెలిపారు. ప్రయాణికులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని.. ఆహారంతో పాటు ఇతర వసతి సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. వయోధికులైన యాత్రికులందరికీ మెడికల్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
తీవ్రమైన మంచు వర్షం ప్రభావంతో మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వేలాది మంది యాత్రికులు అక్కడే చిక్కుకుపోయారు. సిమికోట్‌లో 525 మంది, హిల్సాలో 550మంది, టిబెట్ వైపు మరో 500 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి సుష్మా పర్యవేక్షణలో ఈ మేరకు రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.