Corona Booster Dose: కరోనా బూస్టర్ డోసు ఎవరికి, ఎప్పుడు, కొత్త మార్గదర్శకాలు జారీ

Corona Booster Dose: ఎప్పట్నించో చెబుతున్నా..ఒమిక్రాన్ వేరియంట్ నేపధ్యంలో కోవిడ్ బూస్టర్ డోసుకు అధికారిక ముద్ర పడింది. దేశంలో కోవిడ్ బూస్టర్ డోసు ఇచ్చేందుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వానున్నారంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 29, 2021, 09:50 AM IST
  • కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసుకు అధికారిక ముద్ర వేసిన కేంద్ర ప్రభుత్వం
  • కరోనా బూస్టర్ డోసు లేదా కరోనా మూడవ డోసుపై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
  • ముందుగా 60 ఏళ్లు దాటిన వ్యక్తులకు బూస్టర్ డోసు, జనవరి 10 నుంచి ప్రారంభం
 Corona Booster Dose: కరోనా బూస్టర్ డోసు ఎవరికి, ఎప్పుడు, కొత్త మార్గదర్శకాలు జారీ

Corona Booster Dose: ఎప్పట్నించో చెబుతున్నా..ఒమిక్రాన్ వేరియంట్ నేపధ్యంలో కోవిడ్ బూస్టర్ డోసుకు అధికారిక ముద్ర పడింది. దేశంలో కోవిడ్ బూస్టర్ డోసు ఇచ్చేందుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వానున్నారంటే..

కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన కొన్ని నెలలకు సర్వత్రా విన్పిస్తూ వచ్చిన మాట కరోనా బూస్టర్ డోసు. కరోనా థర్డ్‌వేవ్ లేదా ఒమిక్రాన్ వేరియంట్ నేపధ్యంలో బూస్టర్ డోసు ఆవశ్యకతపై చర్చ మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది బూస్టర్ డోసు అవసరమని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఇండియాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కరోనా బూస్టర్ డోసుకు అధికారిక ముద్ర వేసింది. అయితే ముందుగా అంటే తొలి ప్రాధాన్యతగా ఎవరికి ఇవ్వాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాల్ని జారీ చేసింది. 

దేశంలో జనవరి 10 వ తేదీ నుంచి కరోనా బూస్టర్ డోసు ప్రారంభం కానుంది. ముందుగా తొలి ప్రాధాన్యతగా 60 ఏళ్లు పైబడి ఉన్నవారికి, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఇవ్వనున్నారు. బూస్టర్ డోసు తీసుకునేందుకు వైద్యుడి ధృవీకరణ అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఓ వైపు కరోనా బూస్టర్ డోసు ప్రక్రియ జనవరి 10 నుంచి ప్రారంభం కానుండగా..మరోవైపు ఎప్పట్నించో నిరీక్షిస్తూ వచ్చిన చిన్నారుల వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 3 నుంచి ప్రారంభించనున్నారు. 15-18 ఏళ్ల వయస్సున్న చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో అపాయింట్‌మెంట్ ప్రక్రియ జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పుడే అపాయింట్‌మెంట్ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం (Central Government)తెలిపింది. 

కరోనా రెండవ డోసు తీసుకున్న 9 నెలల తరువాత బూస్టర్ డోసు (Corona Booster Dose)అందుబాటులో వస్తుందని కోవిన్ ఛీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. రెండవ డోసు తీసుకున్నవారు మాత్రమే మూడవ డోసుకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. కరోనా సంక్రమించి 9 నెలలు గడిచినా..తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నా వైద్యుడిని సంప్రదించిన తరువాతే బూస్టర్ డోసు కోసం దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అయితే బూస్టర్ డోసు అనకుండా మూడవ డోసు లేదా ముందు జాగ్రత్త డోసుగా పిలవాలని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సిబ్బందిని కూడా ఫ్రంట్‌లైన్ వర్కర్ల కేటగరీలో చేర్చనున్నారు. 

కరోనా బూస్టర్ డోసు కోసం వైద్యుడిని సంప్రదించాల్సిన వ్యక్తులు (Guidelines for Corona Booster Dose)

డయాబెటిస్, కిడ్నీ, డయాలసిస్ సమస్యలున్నవారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. కార్డియో వాస్కులర్ వ్యాధి, స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంట్, కేన్సర్, సిర్రోసిస్, సికిల్ సెల్ డిసీజ్, స్టెరాయిడ్స్ వినియోగించేవారు, ఇమ్యునోప్రసెంట్ డ్రగ్స్, మస్క్యులర్ డిస్ట్రోఫీ, శ్వాసకోశ వ్యాధి, వికలాంగులు, బహుళ వైకల్యం కలిగినవారు, తీవ్ర శ్వాసకోశ వ్యాధితో చికిత్స పొందుతున్నవాళ్లు..వైద్యుడి సలహా తీసుకున్న తరువాతే కరోనా బూస్టర్ డోసు వేయించుకోవల్సి ఉంటుంది. 

Also read: EPFO Portal Down: మొరాయిస్తోన్న ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌.. నామినేషన్ దాఖలుకు మూడు రోజులే సమయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News