New Parliament: కొత్త పార్లమెంట్ భవనానికి పేరు ఇదే, భారత్ పేరు మార్పిడి అంతా పుకారేనా

New Parliament: భారతదేశ కొత్త పార్లమెంట్ ప్రారంభమైంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇవాళ్టి నుంచి కొత్త పార్లమెంట్‌లోనే జరగనున్నాయి. అదే సమయంలో ఇండియా పేరు మార్పిడి లేనట్టేనని తెలుస్తోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 19, 2023, 11:12 AM IST
New Parliament: కొత్త పార్లమెంట్ భవనానికి పేరు ఇదే, భారత్ పేరు మార్పిడి అంతా పుకారేనా

New Parliament: ఇండియా వర్సెస్ భారత్. నిన్న మొన్నటి వరకూ ఇదే చర్చ. మీడియాలోనూ, పార్టీల మధ్య ఇదే వాదన నడిచింది. ఇండియా పేరు భారత్‌గా మార్చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారనే చర్చ గట్టిగానే సాగింది. ఇదంతా కేవలం పుకార్లేనా..ఇందులో నిజం లేదా అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. 

జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో విదేశీ అతిధులకు ఏర్పాటు చేసిన విందు ఆహ్వానపత్రం దేశంలో పెద్ద అలజడే రేపింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ బారత్ అని ముద్రించడంతో అసలు రచ్చ ప్రారంభమైంది. భారత్ పేరే నిజమని..ఇండియా అనేది పరాయివాళ్లు పెట్టిన పేరని కొందరు వాదిస్తూ వస్తే..అంత హఠాత్తుగా పేరు మార్చాల్సిన అవసరం ఏముందని మరి కొందరు విమర్శలకు దిగారు. కేంద్ర మంత్రులు కూడా ఈ విషయాన్ని పూర్తిగా కొట్టిపారేయకుండా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడంతో అంతా నిజమే అనుకున్నారు. నిన్నటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అందుకేననే ప్రచారం కూడా ప్రారంభమైంది. 

వాస్తవానికి భారత రాజ్యాంగంలో ఇండియా దటీజ్ భారత్ అనే ఉంది. అంటే కొత్తగా పేరు మార్చాల్సిన అవసరం లేదని కూడా కొందరు వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో పేరు మార్పిడి ప్రచారమంతా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పినట్టు అంతా పుకార్లేనని మరోసారి స్పష్టమైంది.  అసలు కేంద్ర ప్రభుత్వానికి పేరు మార్చే ఆలోచన లేనట్టే తెలుస్తోంది. ఎందుకంటే కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాల ప్రారంభం పురస్కరించుకుని కొత్త పార్లమెంట్ భవనానికి కేంద్ర ప్రభుత్వం పెట్టిన పేరే ఇందుకు కారణం. కొత్త పార్లమెంట్ భవనాన్ని నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. 

పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియాగా నామకరణం

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇవాళ అంటే సెప్టెంబర్ 19న అధికారికంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియాగా నోటిఫై చేశారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకవేళ పేరు మార్చే ఉద్దేశ్యమే ఉంటే పార్లమెంట్ హౌస్ ఆఫ్ భారత్ అనే గెజిట్ వెలువడేదనే వాదన వస్తోంది. అంటే ఇన్నాళ్లూ ఈ విషయంపై జరిగిన చర్చంతా కేవలం రచ్చగానే మారిందా, కేవలం పుకార్లేనా అన్పిస్తోంది. 

Also read: Aditya L1 Mission: భూమికి దూరంగా, సూర్యునివైపుకు ఆదిత్య ఎల్1 ప్రయోగం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News