Corona Fourth Wave: కరోనా మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ సంక్రమణ పెరుగుతుండటంపై రాష్ట్ర ప్రభుత్వాల్ని అప్రమత్తం చేసింది.
దేశంలో ఇప్పుడు కరోనా ఫోర్త్‌వేవ్ భయం వెంటాడుతోంది. కరోనా థర్డ్‌వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకుంటున్న ప్రజానీకానికి కాన్పూర్ ఐఐటీ చేసిన హెచ్చరిక ఆందోళన కల్గిస్తోంది. జూన్ 22 నాటికి దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభమై..ఆగస్టు నాటికి పీక్స్‌కు చేరుతుందనేది ఆ పరిశోధకుల అంచనా. కరోనా సెకండ్ , థర్డ్‌వేవ్ విషయంలో కాన్పూర్ ఐఐటీ అంచనా నిజమైన నేపధ్యంలో ఫోర్త్‌వేవ్‌పై చేసిన అధ్యయం కలకలం కల్గిస్తోంది.
ఇందుకు తగ్గట్టే..ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కేసుల సంఖ్య అత్యంత దారుణంగా పెరిగిపోతోంది. చైనాలో చాలా నగరాలు ఇప్పటికే లాక్ డౌన్ పాటిస్తున్నాయి. దక్షిణ కొరియాలో ఒక్కరోజే 6 లక్షల కేసులు, 4 వందల మరణాలు సంభవించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో కరోనా ఫోర్త్‌వేవ్ హెచ్చరికలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఇటు కేంద్రం కూడా ఇదే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాల్ని అప్రమత్తం చేస్తోంది.
కరోనా మహమ్మారి విషయంలో తక్కువ అంచనా వద్దని..నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచిస్తోంది. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని..కరోనా మార్గదర్శకాల్ని తప్పనిసరిగా పాటించేలా చూడాలని సూచించింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్‌మెంట్ కరోనా నియమావళి, వ్యాక్సినేషన్ విధానంలో ఐదంచెల వ్యూహం మరోసారి అమలు చేయాలని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించడం, మాస్క్‌లు ధరించడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించింది.
Also read: Congress Crisis: మరోసారి ట్రబుల్ షూటర్‌గా గులాం నబీ ఆజాద్, రెబెల్స్‌తో..తరువాత సోనియాతో భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook