/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Double Mask: కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇంట్లో ఉన్నా సరే ఏదో రూపంలో కరోనా వైరస్ సోకుతోంది. వైరస్ నుంచి తప్పించుకోడానికి డబుల్ మాస్క్ ప్రాధాన్యత పెరుగుతోంది. మరి ఇది ఎంతవరకూ శ్రేయస్కరం..

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ధాటికి దేశం విలవిల్లాడుతోంది. ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా పరిస్థితులు దేశంలో భయంకరంగా మారుతున్నాయి. ఆక్సిజన్, బెడ్స్, అత్యవసర మందుల కొరత తీవ్రమవుతోంది. ఈ తరుణంలో వైరస్ నుంచి తప్పించుకోడానికి డబుల్ మాస్క్(Double Mask) ప్రాధాన్యత పెరుగుతోంది. అయితే ఇది ఎంతవరకూ శ్రేయస్కరమనే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. డబుల్ మాస్క్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేసింది.ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వైరస్ నుంచి రక్షణకు డబుల్ మాస్క్ బాగా ఉపయోగపడుతోందని తేలింది. డబుల్ మాస్క్ వేసుకోవడం ద్వారా వైరస్ సంక్రమణ ప్రభావాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచించారు.

అయితే డబుల్ మాస్క్ ఎలా వాడాలనే విషయంలో జాగ్రత్త పాటించాలన్నారు. ఒకే రకమైన రెండు మాస్క్‌లను డబుల్ మాస్క్‌గా వాడవద్దని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) స్పష్టం చేసింది. డబుల్ మాస్క్ వాడేటప్పుడు సర్జికల్ మాస్క్‌తో క్లాత్ మాస్క్ కలిపి ధరించాలని సూచించింది. ఒకే మాస్క్‌ను వరుసగా రెండ్రోజులు వాడవద్దని తెలిపింది. సాధారణ క్లాత్ మాస్క్ 42 నుంచి 46 శాతం రక్షణ కల్పిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. సర్జికల్ మాస్క్(Surgical Mask) అయితే 56.4 శాతం రక్షణ ఇస్తాయంటున్నారు. సర్జికల్ మాస్క్‌పై క్లాత్ మాస్క్(Cloth Mask) ధరిస్తే కరోనా వైరస్ నుంచి 85 శాతం రక్షణ లభిస్తుందని చెబుతున్నారు.

Also read: India COVID-19 Cases: భారత్‌లో వరుసగా రెండోరోజు తగ్గిన కరోనా కేసులు, ఫలితాన్నిస్తున్న LOckdown, నైట్ కర్ఫ్యూలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Central government issued guideline for usage of double mask
News Source: 
Home Title: 

Double Mask: డబుల్ మాస్క్ ఎంతవరకూ క్షేమం, కేంద్రం మార్గదర్శకాలు

Double Mask: డబుల్ మాస్క్ ఎంతవరకూ క్షేమం, కేంద్రం మార్గదర్శకాలు
Caption: 
Double mask ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Double Mask: డబుల్ మాస్క్ ఎంతవరకూ క్షేమం, కేంద్రం మార్గదర్శకాలు
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Tuesday, May 11, 2021 - 11:51
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
91
Is Breaking News: 
No