Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్దానంలో కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుల్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం ఖరారైంది. త్వరలో ఈ ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
కొలీజియం సిఫారసుల విషయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రంహ వ్యక్తం చేసిన నేపధ్యంలో ఆ సిఫారసుల్ని కేంద్రం ఆమోదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు ఇటీవల ముగ్గురి పేర్లను ప్రతిపాదించింది. వీరిలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగస్టీస్ జార్జ్ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందీప్ మెహతా ఉన్నారు. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఈ ముగ్గురిని సిఫారసు చేస్తూ న్యాయమూర్తుల సమర్ధత, సమగ్రత, సామర్ధ్యాన్ని అన్ని విధాలుగా పరిశీలించిన తరువాత న్యాయమూర్తులుగా నియామకానికి సరిపోతారని భావించింది.
కేంద్ర ప్రభుత్వం ఈ ముగ్గురి నియామకానికి ఆమోదముద్ర వేయడంతో ఇక త్వరలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం 31 మంది ఉన్నారు. ఈ ముగ్గురితో ఆ సంఖ్య 34కు చేరుకుంటుంది. ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ వి సుబ్రహ్మణ్యం, జస్టిస్ కృష్ణ మురారి స్థానంలో ఈ ముగ్గురు చేరనున్నారు.
జస్టిస్ సతీష్ చంద్ర శర్మ 2008లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా తరువాత 2021లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2022లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఇక మరో న్యాయమూర్తి జస్టిస్ ఆగస్టీస్ జార్జ్ మసీహ్ 2008లో పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా, 2023 మేలో రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఇక మూడవ వ్యక్తి జస్టిస్ సందీప్ మెహతా 2011లో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా, 2023లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
Also read: Mahua Moitra Case: మహువా లోక్‌సభ సభ్యత్వం రద్దుకు ఎథిక్స్ కమిటీ సిఫారసు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook