Gujarat Assembly Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 89 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 1న, 93 స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. హిమాచల్ ప్రదేశ్‌తో పాటు డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 4.9 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 51 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు కేటాయించామని.. వీటిలో 34 వేలుపైగా ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తక్కువ పోలింగ్ శాతం ఉన్న కేంద్రాలను గుర్తించి.. అక్కడ పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక కృషి చేస్తామని రాజీవ్ కుమార్ తెలిపారు. ఓట్లు వేసేందుకు పట్టణ ఓటర్లు ఆసక్తి చూపించడంలేదని.. ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి పెడుతున్నామన్నారు.
తొలి విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ నవంబర్ 5న ప్రారంభమై.. నవంబర్ 14న ముగుస్తుంది. రెండవ దశకు నవంబర్ 10వ తేదీ నుంచి 17 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. తొలి దశలో 89 స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 18, రెండో దశలో 93 స్థానాలకు నవంబర్ 21 చివరి తేదీ.
గుజరాత్లో మొత్తం 4 కోట్ల 90 లక్షల 89 వేల 765 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2 కోట్ల 53 లక్షల 36 వేల 610 మంది, మహిళా ఓటర్లు 2 కోట్ల 37 లక్షల 51 వేల 738 మంది ఉన్నారు. 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18తో ముగియనుంది.
గతంలో ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీలతో పాటు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించలేదు. అయితే డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్‌తో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 14న ఈసీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఒకే దశలో పోలింగ్ జరగనుంది.
Also Read: Rajagopal Reddy: ఓటు వేసే అవకాశం కోల్పోయిన రాజగోపాల్ రెడ్డి.. కారణం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook