Earthquake Causes: భూకంపాలు ఎలా ఏర్పడతాయో తెలుసా..? అసలు కారణం ఇదే..!

Delhi Earthquake Today: భూకంపాలు ఎలా సంభవిస్తాయి..? భూప్రకంపనలను ఎలా కొలుస్తారు.? భూకంపం సంభవించినప్పుడు లోపల ఏం జరుగుతుంది..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2022, 08:39 AM IST
Earthquake Causes: భూకంపాలు ఎలా ఏర్పడతాయో తెలుసా..? అసలు కారణం ఇదే..!

Delhi Earthquake Today: నేపాల్‌లో భారీ భూప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. ఈ ప్రకంపనల ఎఫెక్ట్ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని ప్రజలపై కూడా పడింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. భూప్రకంపం ధాటికి దోతి జిల్లాలో ఆరుగురు చనిపోయారు. మరికొంత మంది గాయపడ్డారు. ప్రతి ఏడాది భూకంపాలు ఎందుకు వస్తాయి..? దీనికి కారణం ఏమిటి..? భూకంపం కలిగించే కదలికలు ఎలా ఏర్పడతాయి..? ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 వేలకు పైగా భూకంప ప్రకంపనలు నమోదవుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రకంపనలు చాలా వరకు బయటకు రావు. ఇవి చాలా తేలికపాటివి. ఇవి సీస్మోగ్రాఫ్‌లో కూడా నమోదు కావు.  

భూకంపాలకు ఎందుకు సంభవిస్తాయి.

భూమి నాలుగు పొరలతో నిర్మితమై ఉంటుంది. ఈ నాలుగు పొరలు ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్‌గా ఉంటాయి. క్రస్ట్, ఎగువ మాంటిల్ కోర్‌ను లిథోస్పియర్ అంటారు. ఈ 50 కి.మీ మందపాటి పొర అనేక భాగాలుగా విభజించబడి ఉంటుంది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని కూడా అంటారు. భూమి లోపల 7 ప్లేట్లు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి. ఈ పలకలు చాలా బలంగా కదిలినప్పుడు.. మనకు భూప్రకంపనలు వస్తాయి. 

భూకంప తీవ్రతను ఎలా తెలుసుకోవాలి

భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేల్ ఆధారంగా కొలుస్తున్న విషయం తెలిసిందే. దీనిని రిక్టర్ మాగ్నిట్యూడ్ టెస్ట్ స్కేల్ అని కూడా అంటారు. భూకంపాలను రిక్టర్ స్కేలుపై 1 నుంచి 9 వరకు కొలుస్తారు. ఇది భూకంపం కేంద్రం నుంచి కొలుస్తారు. భూకంపం సంభవించినప్పుడు.. ఆ సమయంలో భూమి లోపల నుంచి విడుదలయ్యే శక్తి తీవ్రతను లెక్కించి భూకంపాన్ని కొలుస్తారు. 

ప్లేట్ల కదలిక కారణంగా భూగర్భ శక్తి విడుదలయ్యే ప్రదేశానికి కొంచెం దిగువన భూకంప కేంద్రం ఉంటుంది. భూప్రకంపనలు ఎక్కువగా ఉండే ప్రదేశం ఇదే. ఈ కంపనం ఫ్రీక్వెన్సీ ఎంత దూరం ఉంటే.. దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. రిక్టర్ స్కేల్‌పై 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత ఉంటే.. భూకంపం సంభవించిన 40 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనలు సంభవిస్తాయి.  

Also Read: Delhi Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. ముగ్గురు మృతి! ఢిల్లీలో భారీ ప్రకంపనలు

Also Read: Pawan Kalyan: ఇంకా ఊడిగం  ఎవరికి చేస్తాం.. ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్ధలు కొట్టక తప్పదు: పవన్ కళ్యాణ్‌   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News