Delhi Fire Breaks: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 80 షాపులు దగ్ధం! భారీగా ఆస్తినష్టం!!

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చాందినీ చౌక్‌లోని లజ్‌పత్ రాయ్ మార్కెట్‌లో ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 02:56 PM IST
  • ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
  • మార్కెట్‌లో భారీగా ఎగసి పడుతున్న మంటలు
  • మంటలార్పుతున్న 12 ఫైరింజన్లు
Delhi Fire Breaks: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 80 షాపులు దగ్ధం! భారీగా ఆస్తినష్టం!!

Fire broke out at Lajpat Rai market in Delhi's Chandni Chowk: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చాందినీ చౌక్‌లోని లజ్‌పత్ రాయ్ మార్కెట్‌ (Lajpat Rai Market)లో ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్‌లో భారీగా మంటలు ఎగసి పడడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. 16 ఫైరింజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇప్పటికే అక్కడ భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో మార్కెట్‌లోని చాలా దుకాణాలు కాలి బూడిదయ్యాయి.

లజ్‌పత్ రాయ్ మార్కెట్‌లో అగ్నిప్రమాదం (Delhi Fire Breaks) జరిగిందని ఉదయం 4.35 గంటలకు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం వెళ్లింది. ముందుగా 10 ఫైరింజన్ల (Fire Engines) సాయంతో అగ్నిమాపక సిబ్బంది లజ్‌పత్ రాయ్ మార్కెట్‌లోని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో మరో ఆరు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. ఉదయం 4.35 గంటలకు నుంచి ప్రయత్నం చేస్తే.. 8 గంటలకు మంటలు పూర్తిగా ఆరిపోయాయి. ఆ సమయంలో మార్కెట్ ఏరియా మొత్తం భారీగా పొగ అలుముకుంది. 

ఈ ప్రమాదంలో మార్కెట్‌లోని దాదాపు 80 దుకాణాలు (80 Shops) కాలి బూడిదయ్యాయి. మార్కెట్‌లో భారీ ఆస్తి నష్టం జరిగింది. వస్త్ర దుకాణాలు కాలి దూడిదయిన దృశ్యాలు మనం చోడోచ్చు. తెల్లవారు జామున కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏ ప్రమాదంలో మొత్తం నష్టం కోట్లలో ఉంటుందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దుకాణదారులందరి స్టేట్‌మెంట్‌లను  పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News