Maharashtra Omicron Cases: మహారాష్ట్ర(Maharashtra)లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కల్లోలం సృష్టిస్తోంది. మంగళవారం తాజాగా 8 ఒమిక్రాన్ కేసులు(8 More Omicron Cases) వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది. కొత్త కేసుల్లో 7 ముంబైకు, ఒకటి వసాయి విరార్ కు చెందినవి. దేశంలో కేసుల సంఖ్య 57కి పెరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ముంబయి(Mumbai)లో 12, పింప్రి-చించ్వాడ్‌లో 10, కళ్యాణ్ డోంబివాలిలో ఒకటి, పూణే మున్సిపల్ కార్పొరేషన్‌లో రెండు, నాగ్‌పూర్, వసాయి విరార్ మరియు లాతూర్‌లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 19 ఒమిక్రాన్ క్రియాశీల కేసులు ఉన్నాయి. ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) విజృంభిస్తోన్న నేపథ్యంలో..ఈ నెల 28న శివాజీ పార్క్ వద్ద జరగాల్సిన ర్యాలీని వాయిదా వేయాలని కాంగ్రెస్ ముంబై యూనిట్ నిర్ణయించింది.
Also Read: Omicron in Surat: సూరత్ లో తొలి Omicron కేసు.. దేశంలో 41కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
ఇటీవల బాలీవుడ్ హీరోయిన్స్ కరీనా కపూర్(Kareena Kapoor), అమృతా అరోరాలకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది.ఈ నేపథ్యంలో...బాంద్రా, ఖార్ లోని నాలుగు భవనాలను బీఎంసీ(Brihanmumbai Municipal Corporation) మంగళవారం మూసివేసింది. వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
8 more patients found infected with #Omicron in the state. Out of these 7 are from Mumbai & 1 patient is from Vasai Virar. Till date, a total of 28 patients infected with Omicron have been reported in the state. Out of these, 9 have been discharged after negative RT-PCR test. pic.twitter.com/AptIVHMk8h
— ANI (@ANI) December 14, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook