BJP Candidates: రఘునందన్‌ రావుకు ప్రమోషన్‌.. బీఆర్‌ఎస్‌ నుంచి చేరినవారికే బీజేపీ టికెట్లు

Telangana BJP Candidates For Lok Sabha Elections: బీజేపీ విడుదల అభ్యర్థుల రెండో జాబితాలో తెలంగాణకు చెందిన కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో ఒకరికి ప్రమోషన్‌ దక్కగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వచ్చిన వారికే టికెట్లు దక్కాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 13, 2024, 08:54 PM IST
BJP Candidates: రఘునందన్‌ రావుకు ప్రమోషన్‌.. బీఆర్‌ఎస్‌ నుంచి చేరినవారికే బీజేపీ టికెట్లు

BJP Second List: లోక్‌సభ ఎన్నికల్లో గతం కంటే ఈసారి అత్యధిక స్థానాలు సాధించాలనే లక్ష్యంగా ఉన్న బీజేపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా రెండో జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినవారే ప్రధానంగా ఉన్నారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు ప్రమోషన్‌ దక్కగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు దక్కాయి. వీటితో కలిపి మొత్తం 15 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన పూర్తవగా.. కీలకమైన ఖమ్మం, వరంగల్‌ స్థానాలకు ఇంకా ప్రకటించలేదు.

Also Read: Gangsters Marriage: అంగరంగ వైభవంగా గ్యాంగ్‌స్టర్ల పెళ్లి.. ఖైదీలు, గూండాలు, రౌడీలే అతిథులు

తాజా జాబితాలో అభ్యర్థులు వీరే

  • ఆదిలాబాద్‌- గోడం నగేశ్‌
  • పెద్దపల్లి- గోమాస శ్రీనివాస్‌
  • మెదక్‌ - రఘునందన్‌ రావు
  • నల్లగొండ - శానంపూడి సైదిరెడ్డి
  • మహబూబ్‌నగర్‌ - డీకే అరుణ
  • మహబూబాబాద్‌ - సీతారాం నాయక్‌

Also Read: CAA Implement: 'మోదీ అమలుచేస్తే మేం చేయాల్నా? మోదీ గాడ్సే నిర్ణయం': కేంద్రానికి ప్రతిపక్షాల ఆల్టిమేటం

బీఆర్ఎస్ వారికి అవకాశం..
అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గోడం నగేశ్‌ శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో సీనియర్‌ నాయకుల సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాగా సీతారాం నాయక్‌ను ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పార్టీలోకి స్వయంగా ఆహ్వానించారు. ఇంకా పార్టీలో చేరకముందే ఆయనకు టికెట్‌ లభించడం గమనార్హం. కాగా వరంగల్‌ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను చేర్చుకోవాలని భావించగా గులాబీ పార్టీ ఆ కుట్రను తిప్పికొట్టింది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ కడియం శ్రీహరితో కూడా సంప్రదింపులు చేస్తోందని తెలుస్తోంది. రమేశ్‌, కడియం ఇద్దరిలో ఎవరూ చేరినా వారికి వరంగల్‌ టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది. వాళ్లు పార్టీలో చేరడమే ఆలస్యం.

జాబితాలో ప్రముఖులు
మొత్తం 195 మందితో తొలి జాబితాను బీజేపీ ప్రకటించగా బుధవారం 72 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. వీరిలో దేశంలోని కీలకమైన స్థానాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో ఆరు స్థానాలకు, కర్ణాటక, మహారాష్ట్రలో 20 చొప్పున స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ (నాగ్‌పూర్‌) ప్రహ్లాద్‌ జోషి (ధార్వాడ్‌), పీయూష్‌ గోయల్‌ (ఉత్తర ముంబై), అనురాగ్‌ ఠాకూర్‌ (హమిర్‌పూర్‌), శోబా కరంద్లాజే (ఉత్తర బెంగళూరు)తోపాటు తాజా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌(కర్నాల్‌), మాజీ ముఖ్యమంత్రులు త్రివేంద్రసింగ్‌ రావత్‌ (హరిద్వార్‌), బసవరాజ్‌ బొమ్మై (హవేరి)లకు స్థానం లభించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News