Kishan Reddy: కిషన్ రెడ్డికి బంపర్ ఆఫర్..? బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సికింద్రాబాద్ సికిందర్..?

Kishan Reddy: రీసెంట్ గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా 400 సీట్లు సాధిస్తామన్న బీజేపీ వ్యూహం ఫలించలేదు. మొత్తంగా ఎన్డీయే 292 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా ప్రక్షాలించే పనిలో పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 9, 2024, 10:51 AM IST
Kishan Reddy: కిషన్ రెడ్డికి బంపర్ ఆఫర్..?  బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సికింద్రాబాద్ సికిందర్..?

Kishan Reddy: తాజాగా జరిగిన 18వ లోక్ సభ ఎన్నికల్లో అబ్ కీ బార్ 400 పార్ అన్న నినాదం వర్కౌట్ కాలేదు. మొత్తంగా ఎన్టీయే కూటమి 300 లోపు సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా.. ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ రెడ్డిని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమోషన్ లభించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జగత్ ప్రకాష్ నడ్డా పదవీ కాలం ముగిసింది. కానీ సార్వత్రిక ఎన్నికలు పూర్త్యయ్యే వరకు ఆయన్నే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగారు. త్వరలో ఆయన మార్పు ఖాయమనే ముచ్చట వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్ అవుతారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన కేంద్ర క్యాబినేట్ లో చేరనున్నారట.

అందుకే ఇపుడు కిషన్ రెడ్డి పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో ముందుంది. పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడిగా.. తెలంగాణకు రెండు సార్లు ప్రెసిండ్ గా పనిచేసారు. అంతేకాదు మూడు సార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు ఎంపీగా గెలిచిన అనుభవం ఉంది. ఒకవేళ కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైతే.. బంగారు లక్ష్మణ్, వెంకయ్య నాయుడుల తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైన మూడో తెలుగు వాడిగా నిలవనున్నారు. తాజాగా ఆయన ఆధ్వర్యంలో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లు.. 8 లోక్ సభ సీట్లు బీజేపీ సాధించింది. ఒకవేళ కిషన్ రెడ్డి కాకపోతే.. కర్ణాటక సీఎం బీ.ఎస్.యెడ్యూరప్ప పేరు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు గా అయ్యే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమని ఢిల్లీ వర్గాలు చెబుతున్నారు. దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషికి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. మరి ఈ రేసులో ఎవరు బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు అందుకుంటారనేది వెయిట్ అండ్ సీ.

ఇదీ చదవండి:ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం.. రామోజీరావుపై మెగాస్టార్ ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News