వీడియో: ఢిల్లీలో బీజేపీ, ఆప్ నేతల మధ్య ఘర్షణ!

వీడియో: ఢిల్లీలో బీజేపీ, ఆప్ నేతల మధ్య ఘర్షణ!

Last Updated : Nov 4, 2018, 05:18 PM IST
వీడియో: ఢిల్లీలో బీజేపీ, ఆప్ నేతల మధ్య ఘర్షణ!

ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిగ్నేచర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడకు చేరుకున్న బీజేపీ, ఢిల్లీ అధికార పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల మధ్య రాజుకున్న స్వల్ప వివాదం ఒకరిపై మరొకరు ఘర్షణకు దిగేవరకు వెళ్లింది. నేతలు, కార్యకర్తల వాగ్వీవాదంతో అక్కడ ఘర్షణపూరితమైన వాతావరణం నెలకొంది. దీంతో అక్కడే ఉన్న ఢిల్లీ పోలీసులు అతి కష్టం మీద ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలను వేరు చేసి చెరోవైపు తీసుకెళ్లడంతో పరిస్థితి కొంత సద్దుమనిగింది. 

 

 

ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఎంపీ మనోజ్ తివారి మీడియాతో మాట్లాడుతూ.. తన నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా నిర్మాణం నిలిచిపోయిన వంతెనను తాను వచ్చాక తిరిగి ప్రారంభిస్తే, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభోత్సవం నిర్వహించడం ఏంటని ఆప్ వర్గాలను నిలదీశారు. అయినా సరే తనకు ఇక్కడికి ఆహ్వానం ఉంది కాబట్టే వచ్చాను. అరవింద్ కేజ్రీవాల్ కి స్వాగతం పలికేందుకు వచ్చిన తనను ఢిల్లీ పోలీసులు ఏదో నేరస్తుడిని చూసినట్టు చుట్టుముట్టడం ఏంటని మనోజ్ తివారి ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు, ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తమ పట్ల అమర్యాదగా ప్రవర్తించాయని మనోజ్ తివారి తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.

అయితే, ఇదే విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత దిలీప్ పాండే స్పందిస్తూ.. "మనోజ్ తివారినే బీజేపీ కార్యకర్తలతో ఇక్కడకు వచ్చి గూండాయిజం చేశారని, వారి దాడిలో గాయపడిన చాలామంది అమాయకులు ప్రస్తుతం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు" అని అన్నారు. 

Trending News