నవ వధువు బెడ్ రూమ్‌లో పోలీసుల తనిఖీలు-స్పృహ కోల్పోయిన అత్త-అసలేం జరిగిందంటే

Bihar police raid bride's bedroom: హాజీపూర్‌లో శీలాదేవీ అనే మహిళ కుమారుడికి ఐదు రోజుల క్రితం వివాహం జరిగింది. ఇటీవల ఓరోజు... నవ వధువు ఆమె బెడ్‌రూమ్‌లో ఉన్న సమయంలో పోలీసులు అకస్మాత్తుగా ఆ గదిలోకి చొరబడ్డారు. హఠాత్తుగా పోలీసులు రావడంతో ఆ నవ వధువుకు, ఆమె అత్త శీలాదేవీకి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 07:11 PM IST
  • బీహార్‌ పోలీసుల అత్యుత్సాహం
  • నవ వధువు బెడ్ రూమ్‌లో ఆకస్మిక తనిఖీలు
  • మద్యం బాటిళ్లు ఉన్నాయన్న అనుమానంతో
  • పోలీసులపై వెల్లువెత్తుతున్న విమర్శలు
నవ వధువు బెడ్ రూమ్‌లో పోలీసుల తనిఖీలు-స్పృహ కోల్పోయిన అత్త-అసలేం జరిగిందంటే

Bihar police raid bride's bedroom: బీహార్ పోలీసులు (Bihar Police) అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ ఇంట్లోని నవ వధువు గదిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మహిళా పోలీస్ లేకుండానే ఆ వధువు బెడ్ రూమ్‌లోకి ప్రవేశించి గది మొత్తం వెతికారు. ఆ గదిలో మద్యం బాటిళ్లు (Liquor) దాచిపెట్టారనే అనుమానంతో తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హత్సర్‌గంజ్‌లోని హాజీపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

హాజీపూర్‌లో శీలాదేవీ అనే మహిళ కుమారుడికి ఐదు రోజుల క్రితం వివాహం (Wedding) జరిగింది. ఇటీవల ఓరోజు... నవ వధువు ఆమె బెడ్‌రూమ్‌లో ఉన్న సమయంలో పోలీసులు అకస్మాత్తుగా ఆ గదిలోకి చొరబడ్డారు. హఠాత్తుగా పోలీసులు రావడంతో ఆ నవ వధువుకు, ఆమె అత్త శీలాదేవీకి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. పోలీసులు ఆ గదిలో వెతుకుతుండగా... దేనికోసం వెతుకుతున్నారని ఆ నవ వధువు ప్రశ్నించింది. పోలీసులు సమాధానం ఇవ్వకపోగా... సైలెంట్‌గా ఉండాలని గద్దించారు.

ఆ తర్వాత కొద్దిసేపటికి... మద్యం బాటిళ్ల కోసం వెతుకుతున్నట్లు పోలీసులు ఆమెతో చెప్పారు. ఆ గదిలోని కప్ బోర్డులు, సూట్ కేసులు, అల్మారా, అన్నింట్లో వెతికారు. పోలీసుల రాకతో ఆందోళనకు గురైన ఆ నవ వధువు (Newlywed Bride) అత్త శీలాదేవీ అప్పటికే స్పృహ కోల్పోయారు. అయినప్పటికీ పోలీసులు తనిఖీలు ఆపలేదు. చాలాసేపు తనిఖీలు చేశాక.. ఆ గదిలో ఏమీ దొరక్కపోవడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పోలీసుల తనిఖీలతో స్థానికంగా తాము ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని శీలా దేవీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ ఇంట్లో మద్యం సేవించే అలవాటు ఎవరికీ లేదని... అయినప్పటికీ పోలీసులు తమ ఇంట్లో తనిఖీలు చేయడం బాధించిందని చెప్పారు. సెర్చ్ వారెంట్ (Search Warrant) లేకుండానే పోలీసులు తమ ఇంట్లో తనిఖీలు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై స్పందించేందుకు స్థానిక ఎస్పీ నిరాకరించారు.

కొద్దిరోజుల క్రితం పాట్నాలోని ఓ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మద్యం బాటిళ్లు ఉన్నాయన్న అనుమానంతో ఓ నవ వధువు గదిలోకి చొరబడి తనిఖీలు నిర్వహించారు. ఆ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తగా... మరోసారి ఆ సీన్ రిపీట్ అవడం గమనార్హం. కాగా, బీహార్‌లో 2016 నుంచి మద్యపాన నిషేధం అమలవుతోంది. అయితే పేరుకే మద్యపాన నిషేధం కానీ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల కల్తీ మద్యం కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఆ సమయంలో సీఎం నితీశ్ బిహార్ (Nitish Kumar) ప్రజలతో మద్యపానం ముట్టమని ప్రతిజ్ఞలు కూడా చేయించారు.

Also Read: Garuda Puranam: ఈ నాలుగు కనిపిస్తే.. ఆరోజు మీకు తప్పక శుభం కలుగుతుంది...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News