Sadanand Singh: కాలేయ సంబంధిత వ్యాధితో మాజీ సీఎం మృతి

Sadanand Singh: బీహార్ మాజీ సీఎం, ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత సదానంద్ సింగ్ కన్నుమూశారు. బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలోని కహల్‌గావ్ అసెంబ్లీ స్థానం నుంచి సదానంద్ సింగ్…తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 8, 2021, 01:30 PM IST
  • బీహార్ కాంగ్రెస్ నేత సదానంద్ సింగ్ కన్నుమూత
  • కాలేయ సంబంధిత వ్యాధితో మాజీ సీఎం మృతి
  • కహల్‌గావ్ అసెంబ్లీ స్థానం నుంచి 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
Sadanand Singh: కాలేయ సంబంధిత వ్యాధితో మాజీ సీఎం మృతి

Sadanand Singh:  బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత సదానంద్‌ సింగ్‌ కన్నుమూశారు. ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదన్ మోహన్(Madan Mohan).. సదానంద్‌ (Sadanand Singh) మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌(Twitter)లో స్పందించారు. ‘బీహార్‌(Bihar)కు చెందిన ప్రముఖ నేత, కాంగ్రెస్ యోధుడు సదానంద్ సింగ్ ఈరోజు కన్నుమూశారు. ఆయన మృతితో ఒక రాజకీయ శకం ముగిసింది. మీ నవ్వుతున్న ముఖం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్‌ చేశారు.

సదానంద్ సింగ్ కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధి(Liver disease)తో బాధపడుతున్నారు. ప్రస్తుతం పట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఈరోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. బీహార్ ప్రతిపక్ష నేత తేజశ్వి యాదవ్(Tejaswi Yadav) సదానంద్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Also Read: Viral: మధ్యప్రదేశ్ లో దారుణం...వానలు కోసం నగ్నంగా బాలికల ఊరేగింపు..

బీహార్‌(Bihar)లోని భాగల్‌పూర్ జిల్లాలోని కహల్‌గావ్ అసెంబ్లీ స్థానం నుంచి సదానంద్ సింగ్(Sadanand Singh)… తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సదానంద్ సింగ్ 2000 నుండి 2005 వరకు బీహార్ శాసనసభ స్పీకర్‌గా కూడా ఉన్నారు. అంతకుముందు అతను బీహార్ నీటిపారుదల మరియు ఇంధన మంత్రిగా పనిచేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News