Memes on Chandrayaan-3: రాఖీ పండుగ ముందే వచ్చేసింది": చంద'మామ'కి రాఖీ కట్టిన 'భారత్' మాత

చంద్రయాన్ 3 సక్సెస్ తరువాత ప్రపంచ దేశాలు భారత్ కు శుభాకాంక్షలు తెలుపుతున్న సంగతి తెలిసిందే! అయితే చంద్రయాన్ 3 సక్సెస్ పై చాలా మీమ్స్ పుట్టుకువస్తున్నాయి. కానీ ఒక రాఖీ కి చెందిన మీమ్ మాత్రం తెగ వైరల్ అవుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 24, 2023, 12:31 PM IST
Memes on Chandrayaan-3: రాఖీ పండుగ ముందే వచ్చేసింది": చంద'మామ'కి రాఖీ కట్టిన 'భారత్' మాత

 Memes on Chandrayaan-3: రాఖీ పౌర్ణమికి ఇంకా టైమ్ ఉంది కదా..‍‍‍! అప్పుడే రాఖీ వచ్చింది అంటారేంటి అనుకుంటున్నారా? మీరు అనుకున్నది నిజమే. ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న బంధాన్ని కలిపిన చంద్రయాన్-3 గురించి!! అయ్యయ్యో అక్కాతమ్ముళ్ల గురించి చెప్తూ మళ్లీ చంద్రయాన్ మిషన్ గురించి ప్రస్తావించారేంటి అనుకోకండి. ఈ స్టోరీ మొత్తం చదివితే మీరు కచ్చితంగా సంతోషిస్తారు.  

అసలు విషయానికొస్తే.. చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)పై ప్రశంసలు వెల్లువెత్తాయి. చంద్రుని దక్షిణ ధృవంపై మొట్టమొదటిగా అడుగుపెట్టిన ఘనతను భారత్ సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత భారతీయుల ఆనందాలకు అవధులు లేవు. నగరాల్లో, పట్టణాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ సంబరాలు అంబరాన్ని అంటాయి. చంద్రయాన్-3 సక్సెస్‌పై అనేక మీమ్స్, జోక్స్ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకంగా భూమి, చంద్రునికి రాఖీ కట్టే మీమ్ మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.

అమ్మ, మామకి రాఖీ కట్టినట్టుగా..  
భారతదేశంలో నివసించే మనమంతా దేశాన్ని భరతమాతలా.. భూమిని భూమాత లేదా ధరిత్రిగా భావిస్తాం. అదే విధంగా చంద్రున్ని చంద'మామ'గా మనం ముద్దుగా పిలుచుకుంటాం. అయితే ఇస్రో తలపెట్టిన చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత.. భూమి, చంద్రుడికి రాఖీ కట్టినట్లుగా ఓ మీమ్ నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే విక్రమ్ ల్యాండర్‌ను రాఖీలా క్రియేట్ చేశారు. ఇంత క్రియేటివిటీ కలిగిన మీమ్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

ఈ మీమ్ చంద్రయాన్-3 గురించి వివరించడమే కాకుండా, మనం చిన్నప్పటి నుంచి చంద'మామ'తో ఉన్న బంధుత్వాన్ని ఇందులో పొందుపరిచారు. ఈ విధంగా ఆ మీమ్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఇంకెందుకు ఆలస్యం ఆ మీమ్‌పై ఫన్నీ పోస్టులు మనం కూడా చూసేద్దాం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook  

  

Trending News