జాతీయ రహదారుల అభివృద్ధికి కోసం సరికొత్త పథకానికి మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. హైవేల అభివృద్ధికి సంబంధించిన భారత్ మాలా పథకానికి కేంద్ర కేబినెట్ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా తొలి దశలో 2022 నాటికి 40 వేల కి.మీ. కొత్త హైవేలను నిర్మించనున్నారు. భారత్‌మాల ప్రాజెక్ట్‌లో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 44 ఎకనమిక్ కారిడార్లను గుర్తించారు. ముంబై-కొచ్చి-కన్యాకుమారి,బెంగళూరు-మంగళూరు, హైదరాబాద్-పనాజీ, సంబల్‌పూర్-రాంచీ కారిడార్లు నిర్మించనున్నారు.
2022 నాటికి ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. కీలక రహదారుల్లో ట్రాఫిక్ కదలికలను వేగవంతం చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకూ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల దేశవ్యాప్తంగా 32 కోట్ల శ్రామికులకు ఉపాధి కల్పించవచ్చు.
భారత్‌మాల ప్రాజెక్ట్ సంబంధించిన డీపీఆర్‌లు కూడా సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్‌హెచ్‌డీపీ ప్రాజెక్ట్‌లో భాగంగా గతంలో వేల కి.మీ. హైవేల నిర్మాణం జరగగా ఇప్పుడు భారత్‌మాల పేరుతో రెండో అతిపెద్ద హైవే నిర్మాణ ప్రాజెక్ట్‌కు కేంద్రం శ్రీకారం చుట్టబోతుంది.
హైవేల అభివృద్ధికి సరికొత్త పథకం